Google Chrome వెబ్ స్టోర్
Chrome వెబ్ స్టోర్
  • ప్రోగ్రామ్ పాలసీలు
  • మీరు డెవలపరా?

    మీ Chrome యాప్‌లను పబ్లిష్ చేయండి

Google Chrome వెబ్ స్టోర్ సర్వీస్ నియమాలు

27 జనవరి, 2025న మా సర్వీస్ నియమాలను అప్‌డేట్ చేశాము. మరిన్ని వివరాల కోసం, కీలక మార్పుల సారాంశాన్ని దిగువున అందించాము.

మార్పుల సారాంశం

  • గైడ్‌లైన్స్‌లో స్పష్టత: చక్కటి రివ్యూలు రాయడానికి చిట్కాలు జోడించాము. ఇందులో తగు సమాచారాన్ని ఇవ్వడం, బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం, గౌరవప్రదంగా వ్యవహరించడం వంటి అంశాలు ఉన్నాయి.
  • నియమాలు కఠినంగా అమలు: అభ్యంతరకరంగా ఉన్న లేదా పాలసీలను ఉల్లంఘిస్తున్న రివ్యూలను తీస���వేసే అవకాశం ఉంది. రిపీటెడ్‌గా ఉల్లంఘనకు పాల్పడే వారిపై పోస్టింగ్ నిషేధం కూడా విధించవచ్చు.
  • కొత్త పాలసీలు: కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను ఉపయోగించడం; వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం; చట్టవిరుద్ధమైన, విద్వేషాలు పెంచే కంటెంట్‌ను, అలాగే లైంగికంగా అందరికీ తగని కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి సంబంధించి కొత్త నియమాలను జోడించాము.

1. పరిచయం

1.1 Google Chrome వెబ్ స్టోర్ (“వెబ్ స్టోర్”)ను ఉపయోగించడం ద్వారా, మీరు https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలు, https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీ, అలాగే ఈ వెబ్ స్టోర్ సర్వీస్ నియమాల (అన్ని కలిపి "నియమాలు" అంటారు) ద్వారా కట్టుబడి ఉంటామని అంగీకరించి ఆమోదిస్తున్నారు.

1.2 Google Chromeకు సంబంధించిన వినియోగం కోసం మీరు వెబ్ స్టోర్‌లో ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేసి, కనుగొని, డౌన్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంది. (ప్రోడక్ట్‌లు అంటే Google Chromeకు సంబంధించి, వెబ్ స్టోర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయ్యే సాఫ్ట్‌వేర్, కంటెంట్, డిజిటల్ మెటీరియల్స్ అని అర్థం) ఈ ప్రోడక్ట్‌లలో కొన్నింటిని Google ఆఫర్ చేస్తూ ఉండవచ్చు. మరికొన్నింటిని Googleతో అనుబంధం (అఫ్లియేషన్) లేని థర్డ్-పార్టీలు ఆఫర్ చేస్తూ ఉండవచ్చు. Google ద్వారా కాకుండా వేరే సోర్స్ నుండి వెబ్ స్టోర్‌లోకి వచ్చిన ఏ ప్రోడక్ట్ విషయంలోనూ Google బాధ్యత తీసుకోదని మీరు అంగీకరిస్తున్నారు.

1.3 (1) మీకు ఈ ఆప్షన్‌లు కనిపిస్తున్న చోట, "అంగీకరించండి"ని లేదా "ఆమోదించండి"ని క్లిక్ చేయడం ద్వారా, లేదా (2) యాక్టువల్‌గా వెబ్ స్టోర్ యాప్‌ను లేదా వెబ్ సర్వీస్‌ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ నియమాలను అంగీకరిస్తున్నారు.

1.4 వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి, మీకు తప్పనిసరిగా 13 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మీ వయస్సు 13, 18 ఏళ్ల మధ్య ఉంటే, మీరు వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల లేదా చట్టపరమైన గార్డియన్ అనుమతి పొందాలి.

2. Google వెబ్ స్టోర్ ఏర్పాటు

2.1 Google తన విచక్షణ మేరకు జనరల్‌గా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మీకు గానీ, ఇతర యూజర్లకు గానీ వెబ్ స్టోర్‌ను (లేదా వెబ్ స్టోర్‌లోని ఏవైనా ఫీచర్లను) శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని మీరు అంగీకరిస్తున్నారు.

2.2 Google మీ ఖాతాకు యాక్సెస్‌ను డిజేబుల్ చేస్తే గనుక, వెబ్ స్టోర్‌ను, మీ ఖాతా వివరాలను, మీ ఖాతాలో స్టోర్ చేసిన ఏవైనా ఫైల్స్‌ను లేదా ఇతర ప్రోడక్ట్‌లను యాక్సెస్ చేయకుండా మిమ్మల్ని నిరోధించవచ్చని అంగీకరిస్తున్నారు.

2.3 వెబ్ స్టోర్ యాప్‌లో ఉన్న యూజర్ ఇంటర్‌ఫేస్‌లో వెబ్ స్టోర్‌ను వినియోగించడానికి, ఆపరేట్ చేయడానికి సంబంధించి Google సపోర్ట్ ఇస్తుంది. ప్రోడక్ట్‌లను ఎలా కనుగొనాలి, ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా తొలగించాలి లాంటి అంశాల్లో సాయం చేస్తుంది. డెవలపర్‌లు, వెబ్ స్టోర్‌లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్‌లకు Google, కస్టమర్ సపోర్ట్ ఇవ్వదు. ప్రతి డెవలపర్, తను ఎలాంటి కస్టమర్ సపోర్ట్‌ను ప��రొవైడ్ చేస్తున్నారు అన్నది తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే మీరు సహాయం కోసం నేరుగా వారిని సంప్రదించాలి.

3. మీ వెబ్ స్టోర్ వినియోగం

3.1 వెబ్ స్టోర్‌లో నిర్దిష్ట సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, మీరు మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, Google ఖాతా సమాచారం, అడ్రస్, అలాగే బిల్లింగ్ వివరాలు వంటి మీకు సంబంధించిన సమాచారాన్ని అందించవలసిన అవసరం ఉండవచ్చు. మీరు Googleకు అందించే అటువంటి సమాచారం ఏదైనా ఎల్లప్పుడూ ఖచ్చితంగా, సరిగ్గా, అప్‌డేట్ అయ్యి ఉంటుందని అంగీకరిస్తున్నారు.

3.2 (ఎ) నియమాలు, (బి) సంబంధిత అధికారిక ప్రదేశాల్లో వర్తించే ఏదైనా చట్టం, నియంత్రణ (రెగ్యులేషన్), జనరల్‌గా అంగీకరించే ప్రాక్టీసులు లేదా గైడ్‌లైన్స్ ప్రకారం అనుమతించిన ప్రయోజనాల కోసం మాత్రమే వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి అంగీకరిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య విభాగం అమలు చేసే ఎగుమతి నియంత్రణ చట్టాలు (ఎక్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్), అలాగే యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లోని "ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్" నిర్వహించే శాంక్షన్స్ (ఆంక్షల) ప్రోగ్రామ్‌లతో సహా, వర్తించే అన్ని ఎక్స్‌పోర్ట్ కంట్రోల్స్‌కు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు. వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం ద్వారా, US నుండి గానీ ఇతర వర్తించే ఎగుమతి చట్టాల ప్రకారం గానీ ఎక్స్‌పోర్ట్స్‌ను లేదా సర్వీస్‌లను అందుకోకుండా మీపై నిషేధం ఏదీ లేదని ప్రాతినిధ్యం వహించి హామీ ఇస్తున్నారు. మీరు ప్రోడక్ట్‌ల డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్ మరియు/లేదా వినియోగం వంటి వాటికి సంబంధించిన అన్ని స్థానిక చట్టాలకు, నియంత్రణలకు (రెగ్యులేషన్స్‌కు) కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.

3.3 మీరు Googleతో విడిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, వెబ్ స్టోర్‌ను Google అందించే ఇంటర్‌ఫేస్ ద్వారా కాకుండా వేరే ఇతర మార్గాల్లో యాక్సెస్ (లేదా యాక్సెస్ చేసే ప్రయత్నం) చేయరని అంగీకరిస్తున్నారు. మీరు వెబ్ స్టోర్‌ను ఏవైనా ఆటోమేటెడ్ మార్గాలు (స్క్రిప్ట్‌లు, క్రాలర్‌లు లేదా అటువంటి టెక్నాలజీల వినియోగంతో సహా) ద్వారా యాక్సెస్ (లేదా యాక్సెస్ చేసే ప్రయత్నం) చేయరని నిర్దిష్టంగా అంగీకరిస్తున్నారు, అలాగే వెబ్ స్టోర్ వెబ్‌సైట్‌లో ఉన్న ఏదైనా robots.txt ఫైల్‌లో పేర్కొన్న సూచనలకు కట్టుబడి ఉంటారని హామీ ఇస్తున్నారు.

3.4 మీరు వెబ్ స్టోర్ (లేదా వెబ్ స్టోర్‌కు కనెక్ట్ చేయబడిన సర్వర్‌లు, నెట్‌వర్క్‌లు)కు అంతరాయం లేదా ఆటంకం కలిగించే ఎలాంటి యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వరని అంగీకరిస్తున్నారు. మీరు Google లేదా ఏదైనా థర్డ్-పార్టీ ఆపరేట్ చేసే ఏవైనా సర్వర్‌లకు, నెట్‌వర్క్‌లకు లేదా వెబ్‌సైట్‌లకు అంతరాయం లేదా ఆటంకం కలిగించే విధంగా వెబ్ స్టోర్‌లో ఉండే ఎలాంటి ప్రోడక్ట్‌లను ఉపయోగించరని అంగీకరిస్తున్నారు.

3.5 మీరు Googleతో విడిగా కుదుర్చుకున్న ఒప���పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, ఎటువంటి ప్రయోజనం కోసం అయినా వెబ్ స్టోర్‌ను రీ-ప్రొడ్యూస్, డూప్లికేట్ లేదా కాపీ చేయరని, విక్రయించరని, దానితో వ్యాపారం చేయరని లేదా రీ-సేల్ చేయరని అంగీకరిస్తున్నారు. మీరు ఆ ప్రోడక్ట్ డెవలపర్‌తో విడిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, ఎటువంటి ప్రయోజనం కోసం వెబ్ స్టోర్‌లోని ప్రోడక్ట్ ఏదీ రీ-ప్రొడ్యూస్, డూప్లికేట్, కాపీ చేయరని, విక్రయించరని, దానితో వ్యాపారం చేయరని లేదా రీ-సేల్ చేయరని అంగీకరిస్తున్నారు.

3.6 వెబ్ స్టోర్‌ను, ఏవైనా ప్రోడక్ట్‌లను మీరు వినియోగించినప్పుడు, నియమాల ప్రకారం మీ అనివార్య కార్యాలను (ఆబ్లిగేషన్స్‌ను) పాటించకపోవడం వల్ల తలెత్తే పరిణామాలకు (ఇందులో Googleకు వాటిల్లే ఏదైనా నష్టం / జరిగే డ్యామేజ్ కూడా ఉండే అవకాశం ఉంది) పూర్తి బాధ్యత మీదేనని, (అలాగే మీకు గానీ, ఏదైనా థర్డ్ పార్టీకి గానీ Google ఎలాంటి బాధ్యత వహించదని) అంగీకరిస్తున్నారు.

3.7 ప్రోడక్ట్‌లలో వర్తించే అన్ని మేధో సంపత్తి హక్కులతో పాటు, వీటికే పరిమితం కాకుండా, వెబ్ స్టోర్, అలాగే వెబ్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉండే ప్రోడక్ట్‌లకు సంబంధించి మొత్తం హక్కు, అధికారం, ప్రయోజనం Google మరియు/లేదా థర్డ్ పార్టీల స్వంతమని, మీరు అంగీకరిస్తున్నారు. పేటెంట్ చట్టం, కాపీరైట్ చట్టం, వాణిజ్య రహస్య చట్టం, వ్యాపారచిహ్నం చట్టం, అన్యాయమైన పోటీ చట్టం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా, అలాగే అన్ని ఇతర యాజమాన్య హక్కుల ప్రకారం ఉన్న ఏవైనా, అలాగే అన్ని హక్కులు "మేధో సంపత్తి హక్కులు"గా పరిగణించబడతాయి. మీరు ఇక్కడ పేర్కొన్న విధంగా చేయరని, అలాగే ఏదైనా థర్డ్-పార్టీని ఇలా చేయడానికి అనుమతించరని అంగీకరిస్తున్నారు: (i) అనుమతి ఉంటే తప్ప, దేనిని కాపీ చేయరు, విక్రయించరు, లైసెన్స్ ఇవ్వరు, డిస్ట్రిబ్యూట్, ట్రాన్స్‌ఫర్, మోడిఫై, ట్రాన్స్‌లేట్ చేయరు, అడాప్ట్ చేసుకోరు, డెరివేటివ్ వర్క్స్ ఏవీ జనరేట్ చేయరు, డీకంపైల్, రివర్స్ ఇంజినీరింగ్, డిస్-అసెంబుల్ చేయరు, లేదా ప్రోడక్ట్‌ల నుండి సోర్స్ కోడ్‌ను పొందడానికి ప్రయత్నించరు, (ii) ప్రోడక్ట్‌ల్లో డిజిటల్ హక్కుల మేనేజ్‌మెంట్ లేదా ఫార్వర్డ్-లాక్ వంటి ఏదైనా ఫంక్షనాలిటీ ద్వారా ప్రొవైడ్, డిప్లాయ్, ఎన్‌ఫోర్స్ చేసిన లేదా అమలు చేసిన సెక్యూరిటీ, కంటెంట్ వినియోగ నియమాలను తప్పించుకోవడానికి లేదా భంగం కలిగించడానికి ఎలాంటి చర్యా తీసుకోరు, (iii) ఏదైనా చట్టాన్ని లేదా థర్డ్-పార్టీ హక్కులను ఉల్లంఘించేలా కంటెంట్‌ను యాక్సెస్, కాపీ, ట్రాన్స్‌ఫర్, ట్రాన్స్‌కోడ్ లేదా రీ-ట్రాన్స్‌మిట్ చేయడానికి ఈ ప్రోడక్ట్‌లను ఉపయోగించరు, లేదా (iv) Google లేదా ఏదైనా థర్డ్-పార్టీ కాపీరైట్ నోటీసులు, ట్రేడ్‌మార్క్‌లు (వ్యాపార చిహ్నాలు) లేదా ఇతర యాజమాన్య హక్కుల నోటీసులను తీసివేయరు, అస్పష్టంగా మార్చరు, ఆల్టరేషన్ చేయరు.

3.8 వెబ్ స్టోర్‌లోని ఏదైనా లేదా అన్ని ప్రోడక్ట్‌లను ప్రీ-స్క్రీన్ చేయడానికి (ముందే పరీక్షించడానికి), రివ్యూ, ఫ్లాగ్, ఫిల్టర్, మోడిఫై, రిఫ్యూజ్ చేయడానికి (నిరాకరించడానికి) లేదా తీసివేయడానికి Googleకు హక్కు ఉంది (అయితే ఈ విషయంలో ఆబ్లిగేషన్ (అనివార్య కార్యం) ఏదీ లేదు). అయితే, వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం ద్వారా మీకు అఫెన్సివ్‌గా (అభ్యంతకరంగా), అశ్లీలంగా లేదా అబ్జెక్షనబుల్‌గా అనిపించే ప్రోడక్ట్‌లు ఎదురు పడవచ్చని, వెబ్ స్టోర్‌ను మీ స్వంత విచక్షణపై ఆధారపడి ఉపయోగిస్తున్నారని మీరు అంగీకరిస్తున్నారు.

3.9 వాపసులు (రిటర్న్‌లు): మీరు వెబ్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌ల్లో ఏవైనా వాపసు ఇవ్వడానికి కొనుగోలు (డౌన్‌లోడ్ కాదు) చేసినప్పటి నుండి మీకు 30 నిమిషాల వరకు సమయం ఉంటుంది, ఈ సమయంలో మీకు వర్తించే పూర్తి ఫీజు ఏదైనా ఫుల్ రీఫండ్ అవుతుంది. మీరు పేర్కొన్న ప్రోడక్ట్‌ను ఒక్కసారి మాత్రమే వాపసు చేయవచ్చు; మీరు అదే ప్రోడక్ట్‌ను వెనువెంటనే మళ్లీ కొనుగోలు చేస్తే, రెండవ సారి దాన్ని వాపసు చేయలేకపోవచ్చు. ప్రోడక్ట్ వాపసు ఆప్షన్ అందుబాటులో ఉన్న చోట, వెబ్ స్టోర్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

3.10 రీఫండ్, బిల్లింగ్ వివాదాలు: వెబ్ స్టోర్‌లో కొనుగోళ్లకు సంబంధించి తలెత్తే బిల్లింగ్ వివాదాలకు Google బాధ్యత వహించదు. అన్ని బిల్లింగ్ సమస్యలను తగిన రీతిలో సంబంధిత డెవలపర్‌కు, పేమెంట్ ప్రాసెసర్‌కు లేదా మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి డైరెక్ట్ చేయాలి (పంపించాలి).

3.11 రేటింగ్‌లు, రివ్యూలు, సమస్యల పరిష్కారాలను పోస్ట్ చేయడానికి సంబంధించిన పాలసీలు: రేటింగ్‌లు, రివ్యూలు యూజర్‌లకు సహాయకరంగా, విశ్వసనీయంగా ఉండాలి. Chrome వెబ్ స్టోర్‌లో కంటెంట్‌ను రివ్యూ చేయడం అనేది ఉపయోగకరమైన ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేయడానికి, గొప్ప కంటెంట్‌ను, సర్వీస్‌లను కనుగొనడంలో ఇతర Chrome వెబ్ స్టోర్ యూజర్‌లకు సహాయం చేయడానికి ఒక గొప్ప మార్గం.

  • మంచి రివ్యూ రాయటం కోసం గైడ్‌లైన్స్
  • మీ రివ్యూలను ఉపయోగకరంగా అలాగే సమాచారాన్ని అందించే విధంగా చేయండి.
  • పాజిటివ్‌ల అంశాలను, మైనస్ పాయింట్లను రెండిటినీ చేర్చడానికి ట్రై చేయండి.
  • చదవడానికి అనుకూలంగా ఉండేలా ఉంచండి; గ్రామర్‌ను, స్పెల్లింగ్‌ను చెక్ చేయండి, అలాగే అధికంగా క్యాపిటల్ లెటర్స్‌ను, విరామచిహ్నాలను (పంక్చుయేషన్స్‌ను) ఉపయోగించవద్దు.
  • ఇతరుల పట్ల గౌరవంగా ఉండండి

రేటింగ్‌లకు, రివ్యూలకు సంబంధించిన Chrome వెబ్ స్టోర్ పాలసీలు దిగువున ఉన్నాయి. అభ్యంతరకరమైన (అఫెన్సివ్‌గా ఉన్న) లేదా ఈ పాలసీలను ఉల్లంఘిస్తున్న రివ్యూలను, కామెంట్‌లను మెషిన్ + హ్యూమన్ రివ్యూయర్లు సంయుక్తంగా కృషి చేసి తొలగిస్తారు. పదే పదే లేదా తీవ్రంగా ఉల్లంఘించే వారికి Chrome వెబ్ స్టోర్‌లో పోస్ట్ చేసే అవకాశం లేకుండా పోవచ్చు. మీరు సమస్యను పరిష్కరించడానికి రివిజన్‌ను సమర్పించకపోతే తొలగింపులు నిరవధికంగా జరుగుతాయి. ఆంక్షలను ఆటోమేటిక్‌గా ప్రపంచవ్యాప్తంగా వర్తింపజేస్తారు. మీ ఆంక్ష అనేది ప్రాంతీయ పరిమితికి లోబడి ఉంటే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు.

3.11a స్పామ్ & ఫేక్ రివ్యూలు: మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్‌లో లేదా సర్వీస్‌లో మీకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా మీ రివ్యూలు ఉండాలి.

  • ఫేక్ లేదా అనుచితమైన రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
  • ఒకే రివ్యూను అనేక సార్లు పోస్ట్ చేయవద్దు.
  • అనేక ఖాతాల నుండి ఒకే కంటెంట్ గురించి రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
  • ఇతర యూజర్‌లను తప్పుదారి పట్టించడానికి లేదా రేటింగ్‌ను మార్చడానికి రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
  • ఇతరుల తరఫున రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
  • మీ గుర్తింపును లేదా, మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్‌కు మీకు ఉన్న కనెక్షన్‌ను తప్పుదోవ పట్టించవద్దు.

3.11b టాపిక్‌తో సంబంధం లేని రివ్యూలు: టాపిక్‌కు రిలేటెడ్‌గా, మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్‌కు, సర్వీస్‌కు, లేదా ఎక్స్‌పీరియన్స్‌కు సందర్భోచితంగా ఉండేలా రివ్యూలను ఉంచండి.

  • విన్నపాలను, రాజకీయ లేదా సామాజిక వ్యాఖ్యానాలను, లేదా మీరు రివ్యూ చేస్తున్న కన్జ్యూమర్ ��క్స్‌పీరియన్స్‌కు సంబంధించిన కంటెంట్‌కు, సర్వీస్‌కు, లేదా ప్రధాన అంశాలకు సంబంధం లేని దేన్నీ పోస్ట్ చేయవద్దు.

3.11c అడ్వర్టయిజింగ్: రివ్యూలు ఉపయోగకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము, మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్ లేదా సర్వీస్ కాకుండా వేరే వాటిని ప్రమోట్ చేస్తున్నట్లయితే, అవి ఉపయోగపడవు.

  • అనుబంధ (అఫ్లియేట్) లేదా సిఫార్సు ఆధారిత ప్రమోషన్‌లతో సహా, ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌ల కోసం ప్రమోషనల్ లేదా వాణిజ్యపరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు.
  • ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ అడ్రస్‌లు లేదా లింక్‌లను ఇతర వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయవద్దు.

3.11d ప్రయోజన వైరుధ్యం (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్): రివ్యూలు నిజమైనవి, నిష్పాక్షికమైనవి అయినప్పుడు అవి అత్యంత విలువైనవిగా ఉంటాయి. ఆర్థిక లాభం కోసం పని చేయని వ్యక్తులు వీటిని రాయాలి.

  • రివ్యూలను పోస్ట్ చేసినందుకు ప్రతిగా డబ్బును, ప్రోడక్ట్‌లను లేదా సర్వీస్‌లను అందించవద్దు లేదా స్వీకరించవద్దు.
  • మీకు చెందిన లేదా మీరు పని చేస్తున్న బిజినెస్ సంస్థ రూపొందించిన కంటెంట్‌ను, సర్వీస్‌లను రివ్యూ చేయవద్దు లేదా వాటి ఎక్స్‌పీరియన్స్‌లను షేర్ చేయవద్దు.

3.11e కాపీరైట్ ఉన్న కంటెంట్: రివ్యూలు మీ స్వంతమై ఉండాలి, మీ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రతిబింబించాలి.

  • కాపీరైట్‌తో పాటు, ఇతరుల మేధో సంపత్తి హక్కులను అతిక్రమించేలా ఉండే రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను ఎలా తీసివేయాలో తెలుసుకోండి

3.11f వ్యక్తిగతమైన, గోప్యమైన సమాచారం: రివ్యూలు అనేవి, ఎక్స్‌పీరియన్స్‌లను షేర్ చేసుకోవడానికి ఉద్దేశించినవి. గోప్యమైన వ్యక్తిగత సమాచారాన్ని (సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను) వెల్లడించకుండా మీరు ఒక విషయం గురించి ఏమి అనుకుంటున్నారో దాన్ని వ్యక్తం చేయాలి.

  • పోస్టల్ అడ్రస్ గానీ, భౌతిక (ఫిజికల్) అడ్రస్ గానీ లేదా డ్రైవర్ లైసెన్స్ నంబర్ వంటి వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని గానీ పోస్ట్ చేయవద్దు.

3.11g చట్టవిరుద్ధమైన కంటెంట్: మీ రివ్యూలు చట్టానికి, మీరు అంగీకరించిన ఏవైనా నియమాలకు, లేదా చట్టపరమైన ఒప్పందాలకు అనుగుణంగా ఉండాలి.

  • చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను లేదా అలాంటి కంటెంట్‌కు లింక్‌లు ఉండే రివ్యూలను పోస్ట్ చేయవద్దు.

3.11h లైంగికంగా అందరికీ తగని కంటెంట్: Chrome వెబ్ స్టోర్ విస్తృత పరిధిలో ఉండే ప్రేక్షకుల కోసం ఉద్దేశించినది, రివ్యూలు అందుకు తగినట్టుగా ఉండాలి.

  • లైంగికంగా అందరికీ తగని కంటెంట్ ఉన్న, లేదా అలాంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తూ/కోరుతూ రివ్యూలను పోస్ట్ చేయవద్దు.
  • పిల్లలు లైంగిక సందర్భాల్లో ఉన్నట్లు చిత్రించే లేదా వారిని లైంగిక పద్ధతికి గురి చేసేలా రివ్యూలను పోస్ట్ చేయవద్దు.

3.11i విద్వేషాలు పెంచే కంటెంట్: Chrome వెబ్ స్టోర్ అందరి కోసం ఉద్దేశించినది, రివ్యూలు దానిని ప్రతిబింబించాలి.

  • జాతి, జాతీయత, జాతి మూలం, మతం, లింగం, లింగ గుర్తింపు, లైంగిక ధోరణి, వయస్సు, వైకల్యం, వెటరన్ స్టేటస్ లేదా సంస్థాగత వివక్ష / సామాజిక విపరీత పరిస్థితులకు సంబంధించిన లక్షణాల ఆధారంగా హింసను ప్రోత్సహించవద్దు, సమర్థించవద్దు, లేదా ద్వేషాన్ని రేకెత్తించవద్దు.

3.11j అభ్యంతరకరమైన రివ్యూలు: Chrome వెబ్ స్టోర్ వినోదాన్ని, సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించినది, దాడి చేయడానికి, కించపరచడానికి కాదు.

  • అశ్లీలమైన, అసభ్య, లేదా అభ్యంతరకరమైన భాషతో పోస్ట్ చేయవద్దు.
  • ఇతరులను పీడించే, వారిపై జులుం చలాయించే లేదా దాడి చేసే విధంగా ఉన్న రివ్యూలను పోస్ట్ చేయవద్దు.

4. Google సర్వీస్‌లు, థర్డ్ పార్టీ ప్రో��క్ట్‌లు, సర్వీస్‌లు

4.1 కొన్ని ప్రోడక్ట్‌ల్లో (Google గానీ, థర్డ్ పార్టీలు గానీ ఎవరు డెవలప్ చేసినవైనా కావచ్చు), Google ప్రోడక్ట్‌లతో, సర్వీస్‌లతో అనుబంధంగా ఉపయోగించడానికి తగిన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. తదనుగుణంగా, ఆ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో అటువంటి ఫీచర్‌ల వినియోగం అనేది https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలకు, https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీకి, అలాగే ఏవైనా వర్తించే Google సర్వీస్-నిర్దేశిత నియమాలకు, గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉంటుంది.

4.2 Google డెవలప్ చేసిన ప్రోడక్ట్‌లను మీరు వినియోగించడం అన్నది ఈ వెబ్ స్టోర్ సర్వీస్ నియమాలలోని (Google డెవలప్ చేసిన ప్రోడక్ట్‌లకు అదనపు ఎండ్ యూజర్ నిబంధనలు) సెక్షన్ 8కు లోబడి ఉంటుంది.

5. నష్ట పరిహారం

చట్టం అనుమతించిన గరిష్ఠ పరిధి మేరకు, మీరు వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం వల్ల, (ఇందులో మీరు ఏవైనా ప్రోడక్ట్‌లను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం కూడా ఉంటుంది), లేదా మీరు ఈ నియమాలను ఉల్లంఘించడం వల్ల ఎదురయ్యే ఏవైనా క్లెయిమ్‌లు, చర్యలు, దావాలు లేదా చట్టపరమైన ప్రక్రియల నుండి Google, దాని అనుబంధ సంస్థలు, వాటి డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లను రక్షించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, ఎటువంటి హాని కలగకుండా ఉంచడానికి మీరు అంగీకరిస్తున్నారు. అలాగే, వీటి ఫలితంగా ఉత్పన్నమయ్యే అన్ని నష్టాలకు, బాధ్యతలకు, నష్టపరిహారాలకు, ఖర్చులకు, వ్యయాలకు (సమంజసమైన న్యాయవాది ఫీజులతో సహా) మీరు బాధ్యత వహిస్తారు.

6. వారెంటీల నిరాకరణ

ప్రోడక్ట్‌ల వైఫల్యం కారణంగా మరణానికి, గాయపడటానికి, లేదా తీవ్ర స్థాయిలో భౌతిక లేదా పర్యావరణ హాని సంభవించడానికి అవకాశం ఉన్న అణు కర్మాగారాలు, జీవనాధార వ్యవస్థలు, అత్యవసర కమ్యూనికేషన్‌లు, విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు లేదా ఏవైనా అటువంటి ఇతర యాక్టివిటీలలో ఉపయోగించడానికి వెబ్ స్టోర్ కానీ, ఏవైనా ప్రోడక్ట్‌లు కానీ ఉద్దేశించబడలేదు.

7. సాధారణ చట్టపరమైన నియమాలు

7.1 ఈ నియమాలు మీకు, Googleకు మధ్య పూర్తి చట్టపరమైన ఒప్పందాన్ని రూపొందిస్తాయి, మీ వెబ్ స్టోర్, ప్రోడక్ట్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి, అలాగే వెబ్ స్టోర్, ప్రోడక్ట్‌లకు సంబంధించి మీకు, Googleకు మధ్య ఉండే ఏవైనా పూర్వ ఒప్పందాలను పూర్తిగా రీప్లేస్ చేస్తాయి.

7.2 Google మాతృ సంస్థగా ఉన్న అన్ని కంపెనీల గ్రూప్‌లోని ప్రతి మెంబర్ ఈ నియమాలకు థర్డ్-పార్టీ లబ్ధిదారుగా పరిగణించబడతారు, అటువంటి ఇతర కంపెనీలు వారికి లబ్ధి కలిగించే (లేదా అనుకూల హక్కులు) ఈ నిబంధనల్లోని ఏదైనా నిబంధనను ప్రత్యక్షంగా అమలు చేసే, దానిపై ఆధారపడే హక్కును కలిగి ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఇది కాకుండా, ఏ ఇతర వ్యక్తిని లేదా కంపెనీని ఈ నియమాలకు థర్డ్-పార్టీ లబ్ధిదారులుగా పరిగణించడం జరగదు.

7.3 ఏ అధికారిక ప్రదేశంలో అయినా నిషేధాజ్ఞ నివారణోపాయాల (లేదా దానికి సమాన స్థాయిలో సత్వర చట్టపరమైన ఉపశమనం) కోసం దరఖాస్తు చేసుకోవడానికి Google అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.

8. Google-డెవలప్ చేసిన ప్రోడక్ట్‌ల కోసం అదనపు ఎండ్ యూజర్ నియమాలు

8.1 ఏదైనా ప్రోడక్ట్ లేదా అందులోని భాగాలను ("ప్రోడక్ట్) డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలకు, అలాగే https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీకి కట్టుబడి ఉంటారని ఆమోదించి, అంగీకరిస్తున్నారు.

అదే విధంగా, ఏదైనా ప్రోడక్ట్‌ను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా,ఈ కింది అదనపు ��ియమాలు, షరతులు ("నియమాలు, షరతులు")ను ఆమోదించి, అంగీకరిస్తున్నారు.

8.2 ఆ ప్రోడక్ట్‌కు సంబంధించి అటువంటి ఫీచర్‌ల విషయంలో మీ వినియోగం అనేది https://www.google.com/chrome/terms/ లింక్‌లోని Google Chrome, Chrome OS అదనపు సర్వీస్ నియమాలు, https://www.google.com/chrome/privacy/ లింక్‌లోని Chrome గోప్యతా ప్రకటన అలాగే ఎప్పటికప్పుడు నోటీసు లేక���ండా అప్‌డేట్ చేయబడే Google సర్వీస్-నిర్దేశ సర్వీస్ నియమాలు, గోప్యతా పాలసీ ద్వారా కూడా కట్టుబడి ఉంటుంది. ఈ ప్రోడక్ట్‌కు సంబంధించి మీ కొనసాగుతున్న వినియోగం ఈ నియమాలు, షరతులు అలాగే పేరాలో లిస్ట్ చేయబడిన ఇతర నియమాలకు మీ ఒప్పందం వర్తిస్తుంది. మీరు అంగీకరించకపోతే, దయచేసి ప్రోడక్ట్‌ను ఉపయోగించడాన్ని ఆపివేయండి.

8.3 ఈ ప్రోడక్ట్, సంబంధిత అంశాలు, డాక్యుమెంటేషన్ పూర్తిగా ప్రైవేట్ నిధులతో డెవలప్ చేయబడ్డాయి. ప్రోడక్ట్ యూజర్ గనుక యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీ, డిపార్ట్‌మెంట్, ఉద్యోగి లేదా ఇతర ఎంటిటీ అయితే, టెక్నికల్ డేటా లేదా మాన్యువల్స్‌తో సహా ప్రోడక్ట్ వినియోగం, డూప్లికేట్ చేయడం, రీప్రొడక్షన్, రిలీజ్, మోడిఫికేషన్, డిస్‌క్లోజర్ (బహిర్గతం చేయడం) లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం ఈ నియమాలు, షరతులలో ఉన్న నిబంధనలు, షరతులు, ఒప్పందాలకు లోబడి ఉంటుంది. ఫెడరల్ అక్విజిషన్ రెగ్యులేషన్ 12.212 ప్రకారం సివిలియన్ ఏజెన్సీలకు, డిఫెన్స్ ఫెడరల్ అక్విజిషన్ రెగ్యులేషన్ సప్లిమెంట్ 227.7202 ప్రకారం మిలిటరీ ఏజెన్సీలకు, ప్రోడక్ట్ వినియోగం అన్నది అదనంగా ఈ నియమాలు, షరతులకు లోబడి ఉంటుంది.

8.4 ఎప్పటికప్పుడు, ఏదైనా ప్రోడక్ట్, Google డెవలపర్ నియమాలను లేదా ఇతర చట్టపరమైన ఒప్పందాలు, చట్టాలు, నియంత్రణలను లేదా పాలసీలను ఉల్లంఘిస్తోందా అన్న అంశాన్ని Google నిర్ధారించే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో, Googleకు తన విచక్షణను అనుసరించి మీ సిస్టమ్ నుండి అటువంటి ప్రోడక్ట్‌లను రిమోట్‌గా డిజేబుల్ చేయడానికి లేదా తీసివేయడానికి హక్కు ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు, బగ్స్‌ను ఫిక్స్ చేయడం కోసం లేదా ఫంక్షనాలిటీని మెరుగుపరచడం కోసం ప్రోడక్ట్‌ల అప్‌డేట్‌లను Google Chrome, రిమోట్ సర్వర్‌ల ద్వారా చెక్ చేసే అవకాశం ఉంది. మీ బ్రౌజర్‌లో ఈ ఫంక్షనాలిటీ ఉన్నట్లయితే, మీకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అలాంటి అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్, డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు.

8.5 దిగువ నిర్దేశించిన విధంగా మీరు కానీ లేదా Google కానీ ఉపసంహరించే వరకు ఈ నియమాలు, షరతుల వర్తింపు కొనసాగుతుంది. మీరు మీ సిస్టమ్ లేదా పరికరం నుండి పూర్తి స్థాయిలో శాశ్వతంగా ప్రోడక్ట్‌ను తొలగించడం ద్వారా ఎప్పుడైనా ఈ నియమాలు, షరతులను ఉపసంహరించవచ్చు. మీరు ఈ నియమాలు, షరతులలోని ఏదైనా నిబంధనకు లోబడి ఉండటంలో విఫలమైతే, Google లేదా ఏదైనా థర్డ్ పార్టీ నుండి ఎలాంటి నోటీసు లేకుండానే మీ హక్కులు ఆటోమేటిక్‌గా తక్షణమే ఉపసంహరించబడతాయి. అటువంటి సందర్భంలో, మీరు తప్పనిసరిగా ప్రోడక్ట్‌ను వెంటనే తొలగించాలి.

8.6 చట్టం అనుమతించిన గరిష్ఠ పరిధి మేరకు, మీరు వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం వల్ల, (ఇందులో మీరు ఏవైనా ప్రోడక్ట్‌లను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం కూడా ఉంటుంది), లేదా మీరు ఈ నియమాలను ఉల్లంఘించడం వల్ల ఎదురయ్యే ఏవైనా క్లెయిమ్‌లు, చర్యలు, దావాలు లేదా చట్టపరమైన ప్రక్రియల నుండి Google, దాని అనుబంధ సంస్థలు, వాటి డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లను రక్షించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, ఎటువంటి హాని కలగకుండా ఉంచడానికి మీరు అంగీకరిస్తున్నారు. అలాగే, వీటి ఫలితంగా ఉత్పన్నమయ్యే అన్ని నష్టాలకు, బాధ్యతలకు, నష్టపరిహారాలకు, ఖర్చులకు, వ్యయాలకు (సమంజసమైన న్యాయవాది ఫీజులతో సహా) మీరు బాధ్యత వహిస్తారు.

8.7 ప్రోడక్ట్ వైఫల్యం కారణంగా మరణానికి, గాయపడటానికి, లేదా తీవ్ర స్థాయిలో భౌతిక లేదా పర్యావరణ హాని సంభవించడానికి అవకాశం ఉన్న అణు కర్మాగారాలు, జీవనాధార వ్యవస్థలు, అత్యవసర కమ్యూనికేషన్‌లు, విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు లేదా ఏవైనా ఇతర యాక్టివిటీలలో ఉపయోగించడానికి ప్రోడక్ట్ ఉద్దేశించబడలేదు.

8.8 ఈ నియమాలు, షరతులు అలాగే రెఫరెన్స్ ద్వారా చేర్చబడిన ఏవైనా ఇతర నియమాలు ప్రోడక్ట్‌కు సంబంధించి మీకు, Googleకు మధ్య పూర్తి ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి, మీ ప్రోడక్ట్ వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి, ప్రోడక్ట్‌కు సంబంధించి మీకు, Googleకు మధ్య ఉన్న ఏవైనా పూర్వ లేదా సమకాలీన ఒప్పందాలను పూర్తిగా రీప్లేస్ చేస్తాయి.

8.9 ఏ అధికారిక ప్రదేశంలో అయినా నిషేధాజ్ఞ నివారణోపాయాల (లేదా దానికి సమాన స్థాయిలో సత్వర చట్టపరమైన ఉపశమనం) కోసం దరఖాస్తు చేసుకోవడానికి Google అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.

©2025 Google - Google Home - Google గురించి - నియమాలు - డెవలపర్ డ్యా��్‌బోర్డ్ - సహాయం