చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 2026 జూలై 15
విషయ పట్టిక
- Gemini యాప్స్ గోప్యతా ప్రకటన
- ఏ డేటాను సేకరిస్తారు
- మీ డేటా ఎలా వినియోగించబడుతుంది
- Google సర్వీసుల నుండి Gemini యాప్స్ సహాయాన్ని ఎలా పొందుతాయి
- కనెక్టెడ్ యాప్స్‌తో Gemini యాప్స్ ఎలా పని చేస్తాయి
- ఆడియో ఫీచర్‌లు
- Canvas
- మీ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం
- మేము మీ డేటాను ఎన్ని రోజుల పాటు స��టోర్ చేస్తాం
- కంటెంట్ తీసివేతను రిక్వెస్ట్ చేయడం, మీ డేటాను ఎగుమతి చేయడం
- తెలుసుకోవాల్సిన ఇతర విషయాలు
- ఇతరుల హక్కులను గౌరవించండి
- గోప్యతా ప్రశ్నలు
- సాధారణం
- Gemini యాప్స్ అంటే ఏమిటి?
- నా డేటాను ప్రాసెస్ చేయడానికి అడ్డు చెప్పడం ఎలా? లేదా Gemini యాప్స్ సమాధానాల్లో తప్పుగా ఉన్న డేటాను సరిదిద్దాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం ఎలా?
- యూరోపియన్ యూనియన్ (EU) లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) డేటా సంరక్షణ చట్టం కింద, Gemini యాప్స్ డేటాను ప్రాసెస్ చేయడంలో Googleకు ఉన్న చట్టపరమైన ప్రాతిపదికలు ఏమిటి?
- నాకు యాడ్స్‌ను చూపించడం కోసం, మీరు నా Gemini యాప్స్ చాట్స్‌ను ఉపయోగిస్తారా?
- నా చాట్‌లను ఎవరు చూడగలరు, హ్యూమన్ రివ్యూ Geminiని ప్రతి ఒక్కరికీ ఎలా ఉపయోగపడేలా చేస్తుంది?
- 'యాక్టివిటీని సేవ్ చేయండి' ఆఫ్‌లో ఉన్నప్పుడు నేను చేసిన తాత్కాలిక చాట్‌లను, అలాగే ఇతర చాట్‌లను Google ఎంత కాలం పాటు స్టోర్ చేస్తుంది? ఈ డేటాతో Google ఏమి చేస్తుంది?
- Google నా ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తుంది?
- 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ దేనిని కంట్రోల్ చేస్తుంది?
- Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి, నా ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను Google ఉపయోగించవచ్చా లేదా అనే దానిని నేను ఎలా కంట్రోల్ చేయగలను?
- సమాచారాన్ని సేవ్ చేయమని నేను Gemini యాప్స్‌ను అడిగినప్పుడు ఏమవుతుంది?
- నా ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడానికి Gemini యాప్స్, నా గత చాట్‌లను ఉపయోగించాలా వద్దా అనే అంశాన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలి?
- నేను సైన్ అవుట్ చేసి ఉన్నప్పుడు Gemini యాప్స్‌ను ఉపయోగిస్తే, Google నా డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది?
- లొకేషన్, ఇతర అనుమతుల సమాచారం
- Gemini యాప్స్ ఏ లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తాయి, అది ఎందుకు, ఎలా ఉపయోగించబడుతుంది?
- నా ఖచ్చితమైన లొకేషన్‌ను Gemini యాప్స్ యాక్సెస్ చేస్తున్నాయా, చేస్తుంటే ఉపయోగిస్తున్నాయా అన్నది నాకు ఎలా తెలుస్తుంది?
- Gemini, అలాగే Google Assistant కలిసి పనిచేసినప్పుడు నా డేటా ఎక్కడ సేవ్ అవుతుంది?
- Gemini నా డివైజ్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు, నా మొబైల్ అనుమతులను నేనెలా మేనేజ్ చేసుకోవాలి?
- అప్‌లోడ్‌లు
- Geminiలో కనెక్టెడ్ యాప్స్
- నా డేటాను Gemini, ��నెక్టెడ్ యాప్స్, ఇతర సర్వీస్‌లు ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది?
- కనెక్టెడ్ యాప్స్‌లో ఉండే నా డేటా ద్వారా నా ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడానికి గాను, నేను Geminiని అనుమతించడం ఎలా?
- Geminiలో కనెక్టెడ్ యాప్స్ ద్వారా కాల్స్ చేయడానికి, మెసేజ్‌లు పంపడానికి నా డేటాను ఎలా ఉపయోగిస్తారు?
- Gemini Spark
- Gemini Live
- Chromeలో Gemini
- Android యాప్‌లలో స్క్రీన్ ఆటోమేషన్
- షాపింగ్
- Google Labs అందించే Gems
- ఇతర AI ప్లాట్‌ఫామ్‌ల నుండి ఇంపోర్ట్ (దిగుమతి) చేసిన డేటా
- Notebookలు
- అవతార్‌లు
- Canvas
- సర్వీస్ నియమాలు
- సాధారణం
Gemini యాప్స్ గోప్యతా ప్రకటన
చివరిగా అప్‌డేట్ చేసినది: 2026 జూన్ 29
Google గోప్యతా పాలసీకి అదనంగా ఈ నోటీసు మరింత సమాచారాన్ని ఇస్తుంది. ఈ పాలసీ, నోటీసు రెండూ, మీరు సైన్-ఇన్ చేసి Geminiతో ఇంటరాక్ట్ అయినప్పుడు, Google మీ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తుంది అన్న అంశాన్ని వివరిస్తాయి. Gemini మీ పర్సనల్ AI అసిస్టెంట్. దీన్ని Google డెవలప్ చేసింది. Gemini అందించే సర్వీసులుఇక్కడ లిస్ట్ చేసి ఉన్నాయి (“Gemini యాప్స్” లేదా క్లుప్తంగా “Gemini”). మీరు సైన్-ఇన్ చేయకుండా Geminiని ఉపయోగించినప్పుడు Google మీ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తుందో Google గోప్యతా పాలసీ వివరిస్తుంది.
యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో (ఐరోపా ఆర్థిక మండలిలో), స్విట్జర్లాండ్‌లో Gemini యాప్స్‌ను Google Ireland Limited అందిస్తోంది. మిగిలిన దేశాల్లో Google LLC ఈ యాప్స్‌ను ప్రొవైడ్ చేస్తోంది. ఈ రెండు కంపెనీలను మేము దిగువున "Google"గా రెఫర్ చేస్తాము.
అన్నింటినీ విస్తరించండి అన్నింటినీ కుదించండి
ఏ డేటాను సేకరిస్తారుGemini యాప్స్‌కు మీరు అందించే సమాచారం
- మీరు Gemini యాప్స్‌ను ఏమి అడుగుతారు (మీరు సబ్‌మిట్ చేసే / మాటల ద్వారా చెప్పే ప్రాంప్ట్‌ల వంటివి, అలాగే మీ కోసం చేయమని మీరు Geminiని అడిగే టాస్క్‌లు)
- మీరు Gemini యాప్స్‌కు ఏం షేర్ చేస్తారు (ఫైల్స్, వీడియోలు, మీరు వివరాలు అడిగే స్క్రీన్‌లు, ఫోటోలు, ఇంపోర్ట్ అయిన చాట్‌లు, మీ బ్రౌజర్ నుండి షేర్ చేసే పేజీ కంటెంట్ వంటివి)
- Gemini Liveతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు జెనరేట్ అయిన మీ ట్రాన్స్‌క్రిప్ట్‌లు (టైప్ చేసిన మీ మాటల ఫైళ్లు), రికార్డింగ్‌లు (ఇందులో Liveకు మీరు షేర్ చేసే ఆడియో, వీడియో, స్క్రీన్‌లు కూడా ఉంటాయి)
- మీ ఫీడ్‌బ్యాక్
- మీరు అందించే సూచనలు, ఉదాహరణకు, Gemsలో, స్కిల్స్‌లో, అలాగే Geminiకి సూచనలు (“సేవ్ చేసిన సమాచారం” కొన్ని భాషల్లో)
మీరు Gemini యాప్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మేము కలెక్ట్ చేసే సమాచారం
- Gemini యాప్స్ జెనరేట్ చేసే కంటెంట్ (టెక్స్ట్, కోడ్, ఆడియో, ఇమేజ్‌లు, వీడియో, మ్యూజిక్, పబ్లిక్ లింక్‌లు, సైటేషన్లు, చాట్ సమ్మరీలు, పర్సనలైజ్‌డ్ ఇన్-సైట్స్ (గణాంకాల) వంటివి)
- మీ కోసం టాస్క్‌లను పూర్తి చేయడానికి లేదా మీ ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి మా టెక్నాలజీలు తీసుకునే దశల గురించిన సమాచారం, ఉదాహరణకు మోడల్ థింకింగ్ దశలు
- మీ యాప్‌లు, బ్రౌజర్లు, డివైజ్‌ల నుండి సమాచారం
- మీ కనెక్టెడ్ యాప్స్ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ టూల్స్ వంటి థర్డ్-పార్టీ సర్వీస్‌లతో సహా) నుండి, అలాగే Gemini యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయిన ఇతర Google సర్వీసుల నుండి సమాచారం (ఉదా: మీ Search లేదా YouTube హిస్టరీ, లేదా Chrome నుండి మీ పేజీ కాంటెక్స్ట్ & URL)
- మీ డివైజ్‌లోని యాప్‌ల గురించిన సమాచారం (ఉదాహరణకు, మీ యాప్‌లను ఉపయోగించి పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి)
- Gemini యాప్స్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే యాప్‌లకు, బ్రౌజర్లకు, డివైజ్‌లకు సంబంధించిన సమాచారం (ఉదా: ఐడెంటిఫయర్లు, బ్రౌజర్ టైప్ & సెట్టింగ్స్, డివైజ్ టైప్ & సెట్టింగ్స్, ఆపరేటింగ్ సిస్టమ్)
- Gemini యాప్స్‌తో మీ యాప్‌లు, బ్రౌజర్లు, డివైజ్‌లు చేసే ఇంటరాక్షన్ (ఉదా: ఇంటరాక్షన్ లాగ్స్, పెర్‌ఫార్మెన్స్ మెట్రిక్స్ (పనితీరు కొలమానాలు), క్రాష్ & డీబగ్ సమాచారం)
- మీరు Gemini మొబైల్ యాప్‌లను ఉపయోగించినప్పుడు ఇచ్చే సిస్టమ్ అనుమతుల కిందకు, డివైజ్ డేటా కిందకు ఇవి వస్తాయి: కాల్ & మెసేజ్ లాగ్స్, కాంటాక్ట్‌లు (మీరు టచ్‌లో ఉండేందుకు దోహదపడతాయి); ఇన్‌స్టాల్ అయిన యాప్‌లు (క్లాక్ వంటివి); భాషా ప్రాధాన్యతలు (Geminiతో మాట్లాడటానికి మీకు సాయం చేస్తాయి); స్క్రీన్ కంటెంట్ (ఆ కంటెంట్ మీద తగిన చర్య తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాయి); పేజీ కాంటెక్స్ట్ (సందర్భం) & URL వంటి ఇతర యాప్ సమాచారం (మీరు ప్రశ్నలు అడగడానికి Gemini ఓవర్‌లేని ఉపయోగించినప్పుడు)
- మీ వెబ్‌సైట్ ప్రామాణీకరణ సమాచారం, స్క్రీన్ క్యాప్చర్‌లు లేదా ఇతర పేజీ కంటెంట్ ఉండే కుక్కీల వంటి రిమోట్ బ్రౌజర్ డేటా
- Geminiతో కలిపి మీరు ఉపయోగించే డివైజ్‌ల నుండి, సర్వీసుల నుండి సందర్భోచిత సమాచారం (కాంటెక్స్ట్ ఇన్ఫో) (ఉదా: స్మార్ట్ హోమ్ డివైజ్ నేమ్స్, ప్లేలిస్ట్‌ల వంటివి)
- Gemini యాప్స్‌లో పబ్లిక్‌గా ఉండే కంటెంట్‌తో మీరు చేసే ఇంటరాక్షన్స్‌కు సంబంధించిన డేటా
- అదనపు (సప్లిమెంటల్) సమాచారం: మీరు ఉపయోగించడానికి ఎంచుకున్న సప్లిమెంటల్ Gemini యాప్స్ ఫీచర్ల ద్వారా కలెక్ట్ అయిన సమాచారం.
- లొకేషన్ సమాచారం: మీ లొకేషన్‌కు సంబంధించిన సమాచారంలో మీ డివైజ్‌లోని జనరల్ ఏరియా, IP అడ్రస్, లేదా మీ Google ఖాతాలోని ఇల్లు / వర్క్ ప్లేస్ అడ్రస్ వంటి సమాచారం ఉంటుంది. మరింత తెలుసుకోవడానికి g.co/privacypolicy/location లింక్‌కు వెళ్లండి.
- సబ్‌స్క్రిప్షన్ సమాచారం: మీకు Google AI ప్లాన్‌కు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే, ఆ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది.
గోప్యతా పాలసీలో వివరించిన విధంగా Google ఈ డేటాను కింది వాటి కోసం వినియోగిస్తుంది:
- మా సర్వీసులను అందించడం
- మా సర్వీసులను మెయింటెయిన్ చేయడం, మెరుగుపరచడం
- కొత్త సర్వీసులను అభివృద్ధి చేయడం
- మా సర్వీస్‌లను పర్సనలైజ్ చేయడం
- మా సర్వీసులను అనుకూలంగా మార్చడం (కస్టమైజ్ చేయడం)
- మీతో కమ్యూనికేట్ చేయడం
- పనితీరును అంచనా వేయడం
- Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను సంరక్షించడం
మా సర్వీసులను అందించే జెనరేటివ్ AI మోడల్స్‌కు, ఇతర మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలకు కూడా ఈ డేటా వినియోగాలు వర్తిస్తాయి.
ఈ ప్రయోజనాల కోసం మేము కలెక్ట్ చేసిన కొంత డేటాను రివ్యూవర్‌లు రివ్యూ చేస్తారు (మా సర్వీస్ ప్రొవైడర్‌లకు చెందిన ట్రెయినింగ్ పొందిన హ్యూమన్ రివ్యూవర్‌లు కూడా వీరిలో ఉంటారు). రివ్యూవర్ చూడకూడదని మీరు అనుకుంటున్న లేదా మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో సహా మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి Google ఉపయోగించకూడదు అని మీరు భావించే గోప్యమైన (కాన్ఫిడెన్షియల్) సమాచారాన్ని దయచేసి ఎంటర్ చేయవద్దు.
- Gemini యాప్స్‌ను అందించడానికి మేము ఇతర Google సర్వీసులు & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఆధారపడతాము. ఉదాహరణకు, కొన్ని Gemini సమాధానాలు Search ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. నిర్దిష్ట క్విక్ వాయిస్ చర్యల కోసం Gemini, Google Assistant నుండి సహాయం తీసుకున్నప్పుడు, సంబంధిత Assistant సెట్టింగ్‌లు వర్తిస్తాయి.
- మీ వయస్సు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, Gemini యాప్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకుంటే గనుక, కొన్ని ప్రాంతాల్లో మీ కాలింగ్ / టెక్స్ట్ మెసేజ్ హిస్టరీ, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి Gemini యాప్స్ యాక్టివిటీకి ఇంపోర్ట్ (దిగుమతి) అయ్యే అవకాశం ఉంది. ఇది, మీ Gemini యాప్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంలో సహాయకరంగా ఉంటుంది. ఉదాహరణకు కాంటాక్ట్ సజెషన్స్ (సూచనల) వంటివి అందించడం. మరింత తెలుసుకోండి.
Gemini యాప్స్- Google యాప్‌లు, థర్డ్-పార్టీ సర్వీసుల వంటి కనెక్టెడ్ యాప్స్‌తో కలిసి పని చేస్తాయి. ఈ నోటీస్ ప్రకారం Gemini, కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే సమాచారాన్ని సేవ్ చేస్తుంది, ఉపయోగిస్తుంది. Gemini యాప్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి, సర్వీసులను ప్రొవైడ్ చేయడానికి ఈ సమాచారం తోడ్పడుతుంది. కనెక్ట్ అయిన Google యాప్‌లు వాటి పాలసీలు, అలాగే Google గోప్యతా పాలసీ ప్రకారం సర్వీసులను అందించడానికి, మెరుగుపరచడానికి మీ డేటాను సేవ్ చేసి, వినియోగిస్తాయి. ఒకవేళ మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించి థర్డ్-పార్టీ సర్వీసులతో ఇంటరాక్ట్ అయినట్లయితే, సదరు సర్వీసులు వాటి సొంత గోప్యతా పాలసీలకు అనుగుణంగా మీ డేటాను ప్రాసెస్ చేస్తాయి.
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉన్న అర్హత గల యూజర్లు, కొన్ని Google యాప్‌లను Gemini యాప్స్‌కు కనెక్ట్ చేయవచ్చు. తద్వారా Gemini యాప్స్‌లో గతంలో అందుబాటులో లేని సరికొత్తగా ఉన్న, మరింతగా పర్సనలైజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌లను పొందవచ్చు. అర్హత గురించి మరింత తెలుసుకోండి.
“Ok Google” వంటి శబ్దం వినిపించినప్పుడు లేదా అనుకోకుండా టచ్ చేసినప్పుడు, మీకు Gemini యాప్స్‌ను యాక్టివేట్ చేయాలని లేకపోయినా అవి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. Gemini యాప్స్ స్పందించినట్లయితే, అవి మీ ఇన్‌పుట్‌ను సాధారణ యాక్టివేషన్‌గా పరిగణిస్తాయి. మీ సెట్టింగ్‌ల మీద ఆధారపడి, Google సర్వీసులను మెరుగుపరచడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. వీటిలో Gemini మోడల్స్, Gemini యాప్స్ పని చేయడానికి తోడ్పడే ఇతర జెనరేటివ్ AI మోడల్స్, అనుకోకుండా జరిగే యాక్టివేషన్‌లను తగ్గించడానికి సహాయపడే టెక్నాలజీలు ఉంటాయి.
మీరు యూజర్ జెనరేట్ చేసిన Canvas యాప్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు, మీరు షేర్ చేసే ఏదైనా డేటాను ఆ యాప్ క్రియేటర్ చూడగలరు, తనకు కావాల��సిన చోట దాన్ని సేవ్ చేసుకోగలరు. Canvas యాప్ డేటాను స్టోర్ చేయడానికి Google, Firebaseలో స్పేస్‌ను ప్రొవైడ్ చేస్తుంది. కానీ యాప్ క్రియేటర్ మీ డేటాను వేరే చోట కూడా సేవ్ చేసుకోవచ్చు. పబ్లిక్ లింక్ ఉన్న ఎవరైనా యాప్‌లో సేవ్ అయిన డేటాను చూడగలరు, ఎడిట్ చేయగలరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు నమ్మకంగా ఉన్న Canvas యాప్స్‌కు మాత్రమే డేటాను షేర్ చేయండి.
మీ డేటాను, గోప్యతను మేనేజ్ చేయడానికిమీ Google ఖాతాకు వెళ్లండి. మీ డేటాను, ఎక్స్‌పీరియన్స్‌ను మేనేజ్ చేయడంలో సాయం చేసేందుకు Gemini యాప్స్ మీకు సెట్టింగ్స్‌ను కూడా అందిస్తాయి, ఉదాహరణకు:
- మీ యాక్టివిటీని (ఇందులో ఇంపోర్ట్ అయిన చాట్‌లు ఉంటాయి) రివ్యూ చేయడానికి, తొలగించడానికి, మీ ఆటోమేటిక్ తొలగింపు (ఆటో-డిలీట్) సమయాన్ని మార్చడానికి, మీ డేటాను Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించాలా వద్దా అన్నది కంట్రోల్ చేయడానికి, Gemini యాప్స్ యాక్టివిటీకి వెళ్లండి. జెనరేటివ్ AI మోడల్స్ అందిస్తున్న Gemini యాప్స్ వంటివి ఈ సర్వీసుల్లో ఉంటాయి. Google సర్వీసులను మెరుగుపరచడం కోసం మీ చాట్‌ల ద్వారా అజ్ఞాత (అనానమైజ్‌డ్) డేటా క్రియేట్ అయ్యే ప్రాసెస్‌ను మీ Gemini సెట్టింగ్‌లు కంట్రోల్ చేయవు. మీ 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, మీకు సమాధానం ఇవ్వడానికి, Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను ప్రొటెక్ట్ చేయడానికి Google మీ చాట్‌లను ఉపయోగిస్తుంది. అవసరమైతే రివ్యూవర్ల సాయం కూడా తీసుకుంటుంది.
- Gemల మేనేజర్, స్కిల్స్ మేనేజర్లో Gemsను, స్కిల్స్‌ను మేనేజ్ చేయండి.
- మీ పబ్లిక్ లింక్స్‌లో పబ్లిక్ లింక్స్‌ను మేనేజ్ చేయండి.
- కనెక్టెడ్ యాప్స్ సెట్టింగ్స్‌లో ఇతర యాప్స్‌ను, డేటాను (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ టూల్స్ వంటి థర్డ్-పార్టీ సర్వీసులతో సహా) యాక్సెస్ చేయడానికి Gemini యాప్స్‌ను మేనేజ్ చేయండి.
- మీరు Geminiని సేవ్ చేయి అని కోరిన సమాచారాన్ని మేనేజ్ చేయండి.
- మీ Gemini Spark సెట్టింగ్స్‌ను మేనేజ్ చేయండి.
- మెమరీ, పర్సనల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన పర్సనలైజేషన్‌తో సహా, వ్యక్తిగతీకరణ ఫీచర్‌లను ఎలా మేనేజ్ చేయాలో మరింత తెలుసుకోండి.
- Google యాప్ హోస్ట్ ��ేస్తున్న Geminiని Androidలో మీ డివైజ్ అసిస్టెంట్‌గా ఉపయోగించవచ్చు. Google యాప్ అనుమతులను (డివైజ్ లొకేషన్, మైక్రోఫోన్, నోటిఫికేషన్ అనుమతులు, కెమెరా అనుమతుల వంటి వాటిని) ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
- మీ Gemini మొబైల్ యాప్ సెట్టింగ్స్‌ను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- Google యాప్‌ను ఆటోమేటిక్ డిజిటల్ అసిస్టెంట్ యాప్‌గా ఎలా సెట్ చేయాలి అనే అంశం గురించి మరింత తెలుసుకోండి
మీరు మీ Gemini యాప్స్ సెట్టింగ్స్‌ను మారిస్తే, ఇతర Google సెట్టింగ్స్ మారవు. మీరు ఇతర Google సర్వీస్‌లను వినియోగిస్తున్నప్పుడు, వెబ్ & యాప్ యాక్టివిటీ లేదా లొకేషన్ హిస్టరీ వంటి ఇతర సెట్టింగ్స్- లొకేషన్‌ను, ఇతర డేటాను సేవ్ చేయడం కొనసాగించే అవకాశం ఉంది.
Google గోప్యతా పాలసీలో, అలాగే కలెక్ట్ చేసిన డేటాను Google ఎలా స్టోర్ చేస్తుందిలో వివరించినట్టుగా, మీ డేటా ఎలాంటిది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల ఆధారంగా, మీ డేటాను పలు రకాల టైమ్ పీరియడ్స్‌లో (సమయ వ్యవధుల్లో) స్టోర్ చేస్తాము.
- మీరు Gemini యాప్స్ యాక్టివిటీలో ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌ను ఆటోమేటిక్ (డిఫాల్ట్) సెట్టింగ్‌ల ద్వారా 18 నెలల నుండి 3 నెలలకు, 36 నెలలకు, లేదా అనంతంగా ఉండేలా మార్చవచ్చు. ఎప్పుడైనా సరే మీ Gemini యాప్స్ చాట్‌లను మాన్యువల్‌గా కూడా తొలగించవచ్చు.
- రివ్యూవర్‌లు రివ్యూ చేసిన చాట్‌లు (అలాగే మీ భాష, డివైజ్ రకం, లొకేషన్ సమాచారం లేదా ఫీడ్‌బ్యాక్ వంటి వాటికి సంబంధించిన డేటా), మీరు మీ యాక్టివిటీని తొలగించినప్పుడు డిలీట్ కావు. బదులుగా, అవి మూడేళ్ల పాటు స్టోర్ అయి ఉంటాయి.
- కొంత డేటాను మీరు మీ Google ఖాతాను తొలగించేంత వరకు కొనసాగిస్తాము. ఉదా: మీరు ఎంత తరచుగా Gemini యాప్స్‌ను ఉపయోగిస్తారు లాంటి సమాచారం.
- చట్టబద్ధమైన వ్యాపారం లేదా చట్టపరమైన అవసరాల కోసం, సెక్యూరిటీ (భద్రత), మోసం, దుర్వినియోగ నివారణ, లేదా ఆర్థికపరమైన రికార్డ్‌ల కోసం అవసరమైనప్పుడు, మేము కొంత డేటాను మరింత కాలం పాటు స్టోర్ చేస్తాము.
- మీరు Geminiని ఇతర Google సర్వీస్‌లతో (Wallet లేదా YouTube వంటివి) కలిపి ఉపయోగించినప్పుడు, అవి తమ స్వంత పాలసీలకు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా యాక్టివిటీని సేవ్ చేసి, ఉపయోగించవచ్చు. మీ Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించడం వల్ల ఆ ఇతర సర్వీస్‌లలో సేవ్ చేసిన డేటా తొలగిపోదు.
మీ సమాచారాన్ని తొలగించడానికి మాకు ఎంత సమయం పడుతుందనే అంశంతో సహా, Google యొక్కడేటా రిటెన్షన్ పీరియడ్ల (నిల్వ కొనసాగింపు వ్యవధుల)గురించి మరింత తెలుసుకోండి.
ఏదైనా కంటెంట్ మా పాలసీలకు లేదా వర్తించే చట్టాలకు అనుగుణంగా లేదని మీరు భావిస్తే, దాన్ని తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్‌ను సమర్పించవచ్చు. అంతే కాక, మీ సమాచారాన్ని మీరు ఎగుమతి (ఎక్స్‌పోర్ట్) చేసుకోవచ్చు.
- Gemini యాప్స్ నిరంతరంగా ఎవాల్వ్ అవుతూ (అభివృద్ధి చెందుతూ) వస్తున్నాయి. ఇవి, Google అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే తప్పు సమాచారాన్ని లేదా అభ్యంతరకరమైన సమాచారాన్ని (వ్యక్త���ల గురించి కూడా) ఇచ్చే అవకాశం ఉందని గమనించండి.
- టాస్క్‌లను కంప్లీట్ చేయడంలో మీకు సాయం చేసేందుకు కొన్ని Gemini యాప్స్ ఫీచర్లను డిజైన్ చేశాము. ఈ టాస్క్‌ల్లో మీ Workspace కంటెంట్‌ను మేనేజ్ చేయడం, వెబ్‌సైట్‌లతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేయడం లాంటివి ఉంటాయి. Gemini కొన్నిసార్లు పొరపాట్లు చేయవచ్చు. ఉదాహరణకు, మీకు తెలియకుండా కొనుగోళ్లు చేయడం లేదా మీ డేటాను థర్డ్ పార్టీలకు షేర్ చేయడం వంటివి జరగవచ్చు. అందుకే ఈ ఫీచర్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
- Gemini వెబ్ బ్రౌజింగ్‌ను, టాస్క్‌లను నిశితంగా గమనించండి, అవసరమైతే మధ్యలో ఆపండి.
- కస్టమ్ (అనుకూల) థర్డ్-పార్టీ కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే డేటాను Google మానిటర్ చేయదు లేదా దానికి భద్రత కల్పించదు. వాటిని కనెక్ట్ చేయాలని మీరు నిర్ణయించుకుంటే మీ డేటా, పాస్‌వర్డ్‌లు, డివైజ్‌లు, ఖాతాలు అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.
- రోగ నిర్ధారణ (డయాగ్నసిస్), చికిత్స (ట్రీట్‌మెంట్), వైద్యపరమైన సలహా (మెడికల్ అడ్వయిజ్), లేదా చట్టపరమైన (లీగల్), ఆర్థికపరమైన (ఫైనాన్షియల్), లేదా ఇతర వృత్తిపరమైన (ప్రొఫెషనల్) సహాయం కోసం Gemini యాప్స్‌పై ఆధారపడకండి. దీని అవుట్‌పుట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.
Gemini యాప్స్ గోప్యతా హబ్, Google గోప్యతా పాలసీలో మరింత తెలుసుకోండి.
Geminiని ఉపయోగిస్తున్నప్పుడు, దయచేసి ఇతరుల హక్కులను గౌరవించండి. Live చాట్‌లో వ్యక్తులను రికార్డ్ చేయడానికి ముందు, లేదా Geminiలో వారి ముఖాలను లేదా వాయిస్‌లను ఉపయోగించే ముందు అనుమతి పొందండి. మీకు హక్కులు, అనుమతులు ఉన్న కంటెంట్‌ను మాత్రమే అప్‌లోడ్ చేయండి, జెనరేట్ చేయండి, ఎడిట్ చేయండి.
గోప్యతా ప్రశ్నలు
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 2026 జూలై 15
సాధారణం
Gemini యాప్స్ అంటే ఏమిటి?Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో, అలాగే Gemini యాప్స్ గోప్యతా హబ్‌లో రెఫర్ చేసిన Gemini యాప్స్‌లో ఇవి కూడా ఉంటాయి:
- Gemini వెబ్ యాప్, gemini.google.comలో, అలాగే బ్రౌజర్ సైడ్బార్లలో అందుబాటులో ఉంటుంది
- Gemini మొబైల్ యాప్స్‌లో ఇవి ఉంటాయి:
- Androidలో Gemini యాప్. ఇది మీ ఆటోమేటిక్ సెట్టింగ్ (డిఫాల్ట్) డిజిటల్ అసిస్టెంట్‌గా కూడా ఉంటుంది. గమనిక: Geminiని Google యాప్ హోస్ట్ చేస్తుంది. మీరు Gemini యాప్
ను డౌన్‌లోడ్ చేసుకున్నా కూడా హోస్ట్ చేస్తుంది.
- iOSలో Gemini యాప్
- Androidలో Gemini యాప్. ఇది మీ ఆటోమేటిక్ సెట్టింగ్ (డిఫాల్ట్) డిజిటల్ అసిస్టెంట్‌గా కూడా ఉంటుంది. గమనిక: Geminiని Google యాప్ హోస్ట్ చేస్తుంది. మీరు Gemini యాప్
- MacOSలో Gemini యాప్
- నిర్దిష్ట లొకేషన్లలో Google Messages యాప్‌లో Gemini.
- Android Autoలో Gemini
- బిల్ట్-ఇన్ Googleలో Gemini
- Mapsలో Gemini
- Chromeలో Gemini ఫీచర్. అవైలబిలిటీ గురించి మరింత తెలుసుకోండి.
- Android XRలో Gemini.
"Gemini యాప్స్"ను కొన్నిసార్లు "Gemini యాప్" లేదా "Gemini" అని కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. మీకు వర్క్ ప్లేస్ లేదా స్కూల్ Google ఖాతా ఉంటే, మీరు Gemini యాప్స్‌ను వేర్వేరు డేటా హ్యాండ్లింగ్ నియమాలకు లోబడి ఉపయోగించాల్సి రావచ్చు. Google Workspace గోప్యతా హబ్‌లోని జెనరేటివ్ AIలో మరింత తెలుసుకోండి.
LLM టెక్నాలజీలు (Gemini యాప్స్‌తో సహా) ట్రెయినింగ్‌పై ఆధారితం కాని సమాధానం ఇవ్వవచ్చు, ఇంకా తప్పు సమాచారాన్ని వాస్తవమైన సమాచారంగా అందించవచ్చు.
EUలో జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టంతో సహా, నిర్దిష్ట గోప్యతా చట్టాల ప్రకారం, మీకు వీటిని చేసే హక్కు ఉండవచ్చు:
- మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి అడ్డు చెప్పవచ్చు లేదా
- Gemini యాప్స్ సమాధానాల్లో తప్పుగా ఉన్న వ్యక్తిగత డేటాను సరిదిద్దమని అడగవచ్చు.
ఈ హక్కులను వినియోగించుకోవడానికి, మీరు మా సహాయ కేంద్రంలో రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయవచ్చు.
మీరు నేరుగా Gemini యాప్స్‌లో కూడా రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయవచ్చు. Gemini యాప్స్ సమాధానం కింద, మరిన్ని
చట్టపరమైన సమస్య గురించి రిపోర్ట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
అదనపు రిసోర్స్‌లు
మేము సేకరించిన డేటాకు సంబంధించి, మీ హక్కులను ఎలా వినియోగించుకోవాలనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, Google గోప్యతా పాలసీని, Gemini యాప్స్ గోప్యతా ప్రకటనను చదవండి.
మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానానికి యూరోపియన్ యూనియన్ (EU) లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) డేటా సంరక్షణ చట్టం వర్తిస్తే, దయచేసి కింద ఉన్న వివరాలను జాగ్రత్తగా చదవండి.
మీరు సైన్ ఇన్ చేసి Gemini యాప్స్‌ను ఉపయోగించినప్పుడు, Google మీ సమాచారాన్ని కింద వివరించిన ప్రయోజనాల కోసం, చట్టపరమైన ప్రాతిపదికల కోసం ప్రాసెస్ చేస్తుంది.
“మీ Gemini యాప్స్ సమాచారం” అంటే Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో లిస్ట్ చేసిన డేటా కేటగిరీలు అని అర్థం. వాటిలో ఇవి ఉంటాయి: (i) Gemini యాప్స్‌కు మీరు ప్రొవైడ్ చేసే సమాచారం (మీ ప్రాంప్ట్‌లు, అప్‌లోడ్ చేసిన కంటెంట్, మీ Gemini Live ఇంటరాక్షన్‌ల రికార్డింగ్‌లు & ట్రాన్స్‌క్రిప్ట్‌లు (టైప్ చేసిన మాటల ఫైల్స్), మీ ఫీడ్‌బ్యాక్, Geminiకి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ (సూచనలు) లాంటివి); (ii) మీరు Gemini యాప్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మేము కలెక్ట్ చేసే సమాచారం (Gemini యాప్స్ జెనరేట్ చేసే కంటెంట్, మీ యాప్‌లు, బ్రౌజర్లు, డివైజ్‌లు, కనెక్టెడ్ యాప్స్ నుండి పొందిన సమాచారం, మీరు Gemini మొబైల్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కలెక్ట్ చేసిన డివైజ్ డేటా వంటివి); (iii) మీరు సమ్మతించినప్పుడు Gemini యాప్స్ ఫీచర్ల ద్వారా కలెక్ట్ చేసిన సప్లిమెంటరీ (అనుబంధ) సమాచారం; (iv) లొకేషన్ సమాచారం; (v) సబ్‌స్క్రిప్షన్ సమాచారం.
Google చట్టపరమైన ప్రాతిపదికలు:
- ఒప్పందాన్ని పాటించడం. మేము, మీ Gemini యాప్స్ సమాచారాన్ని, అలాగే Gemini యాప్స్ ప్రాసెస్ చేయడానికి అనుమతించిన ఏదైనా మీ ఇతర సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేస్తాము. ఇందులో మీరు Gemini యాప్స్‌ను వేరే సర్వీస్‌తో కనెక్ట్ చేయడం కూడా ఉంటుంది. దీనివల్ల మీరు రిక్వెస్ట్ చేసిన Gemini యాప్స్ సర్వీస్‌ను మేము ప్రొవైడ్ చేసి, మెయింటెయిన్ చేయగలము. ఈ ప్రాసెస్ Google సర్వీస్ నియమాలకు లోబడి ఉంటుంది. ఉదాహరణకు, మేము ఇందుకోసం మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము: మీ క్వెరీలకు సమాధానం ఇవ్వడానికి; Gemini యాప్స్ ఫీచర్‌లను, ఫంక్షనాలిటీలను ప్రొవైడ్ చేయడానికి. వీటిలో వీడియో జెనరేషన్, ఇమేజ్ ఎడిటింగ్, స్క్రీన్ కంటెంట్‌ను (చర్యలను) ఉపయోగించి Geminiతో చాట్ చేయడం కూడా ఉంటాయి.
- Googleకు, అలాగే థర్డ్-పార్టీలకు చెందిన చట్టబద్ధమైన ప్రయోజనాలకు అనుగుణంగా తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ మీ గోప్యతను సంరక్షిస్తాము.
- మేము పబ్లిక్‌గా యాక్సెస్ చేయగల సోర్స్‌ల నుండి అందే సమాచారాన్ని, అలాగే Gemini యాప్స్‌లోని మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. తద్వారా Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ప్రొవైడ్ చేయగలము, మెయింటైన్ చేయగలము, మెరుగుపరచగలము, డెవలప్ చేయగలము.
- ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
- మా యూజర్ల అవసరాలను నెరవేర్చేందుకు మా సర్వీస్‌లను ప్రొవైడ్ చేయడం, మెయింటైన్ చేయడం, ఇంప్రూవ్ చేయడం. (ఉదాహరణక���: Gemini యాప్స్ సమాధానాల్లో భద్రతను, ఖచ్చితత్వాన్ని పెంచడానికి, మోడల్స్‌ను మెరుగుపరచడానికి మేము చాట్‌లను ఉపయోగిస్తాము).
- మా యూజర్‌లకు ఉపయోగకరమైన కొత్త ప్రోడక్ట్‌లను, ఫీచర్‌లను డెవలప్ చేయడం (ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఉత్తమంగా సరిపోయే కొత్త మోడల్స్‌కు రిక్వెస్ట్‌లను ఎలా పంపించాలో నేర్చుకోవడం, లేదా ఈ రిక్వెస్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్త మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడం వంటివి).
- మా సర్వీస్‌ల పనితీరును నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి మా సర్వీస్‌లను యూజర్‌లు ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడం (యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే ఉద్దేశంతో, యూజర్‌లు, Gemini యాప్స్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి కొలమానాలను జెనరేట్ చేయడం వంటివి).
- యూజర్‌లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం కోసం మా సర్వీస్‌లను అనుకూలంగా మార్చడం (ఉదాహరణకు, మీ లొకేషన్ సమాచారాన్ని, మీ గత సంభాషణలను ఉపయోగించడం ద్వారా Gemini యాప్స్ మరింత సందర్భోచితమైన సమాధానాన్ని అందించగలవు).
- ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
- Gemini యాప్స్ ఫంక్షనాలిటీని, భద్రతను, విశ్వసనీయతను మెయింటెయిన్ చేయడానికి కూడా మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాం. ఇందులో- Googleకు, మా యూజర్‌లకు, లేదా పబ్లిక్‌కు హాని కలిగించగల మోసాన్ని, దుర్వినియోగాన్ని, సెక్యూరిటీ రిస్క్‌లను, సాంకేతిక సమస్యలను గుర్తించడం, నివారించడం, రెస్పాండ్ కావడం వంటివి కూడా ఉంటాయి.
- ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
- మా సర్వీస్‌లకు సంబంధించి మోసాన్ని, దుర్వినియోగాన్ని, సెక్యూరిటీ రిస్క్‌లను, లేదా టెక్నికల్ సమస్యలను గుర్తించడం, నివారించడం, లేదా పరిష్కరించడం (బగ్‌లను, వైఫల్యాలను పరిష్కరించడం వంటివి).
- చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా లేదా చట్టం అనుమతించిన మేరకు Googleకు, మా యూజర్‌లకు, పబ్లిక్‌కు సంబంధించిన హక్కులకు, ఆస్తికి, భద్రతకు హాని కలిగించే వాటి నుంచి రక్షించడం (ఉదాహరణకు, సేఫ్టీ క్లాసిఫయర్‌లను, మోడల్ ఫిల్టర్‌లను అప్‌డేట్ చేయడం వంటివి).
- మా యూజర్‌లకు, పబ్లిక్‌కు ప్రయోజనకరంగా ఉండే విధంగా మా సర్వీస్‌లను మెరుగుపరచడం కోసం రీసెర్చ్‌ను నిర్వహించడం.
- చట్టపరమైన దావాలను అమలు చేయడం. ఇందులో వర్తించే సర్వీస్ నియమాలను ఏమైనా ఉల్లంఘించారా అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఉంటుంది (ఉదాహరణకు: అనుమానాస్పద యాక్టివిటీని, అలాగే సమస్యాత్మకమైనవిగా ఫ్లాగ్ చేయబడిన ఇంటరాక్షన్లను రివ్యూ చేయడం).
- డెవలపర్‌లు, హక్కుదారుల వంటి మా పార్ట్‌నర్‌లతో మా వాణిజ్య పార్ట్‌నర్‌లకు ఉన్న అనివార్య కార్యాలను నెరవేర్చేందుకు గాను (ఉదాహరణకు మేధో సంపత్తి హక్కుదారులు దాఖలు చేసే తీసివేత రిక్వెస్ట్‌లను అమలు చేయడం) అలాగే Googleకు చెందిన చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం కూడా ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది.
- ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
- మీ రిక్వెస్ట్‌కు సమాధానం ఇవ్వడానికి, ఉదాహరణకు నిర్దిష్ట కాంటాక్ట్ నుండి వచ్చిన ఈమెయిల్‌కు సారాంశాన్ని రాయడం వంటివి చేయడానికి, మీరు, Gemini యాప్స్‌కు అందించిన ఇతరుల వ్యక్తిగత డేటాను (మీరు, Google Workspace లేదా Google Photos నుండి సమాచారాన్ని పొందమని Gemini యాప్స్‌ను అడిగినప్పుడు సదరు డేటాను) ప్రాసెస్ చేస్తాము.
- మేము పబ్లిక్‌గా యాక్సెస్ చేయగల సోర్స్‌ల నుండి అందే సమాచారాన్ని, అలాగే Gemini యాప్స్‌లోని మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. తద్వారా Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ప్రొవైడ్ చేయగలము, మెయింటైన్ చేయగలము, మెరుగుపరచగలము, డెవలప్ చేయగలము.
- చట్టపరమైన బాధ్యతలు. వర్తించే ఏదైనా చట్టాన్ని, నియంత్రణా చట్టాన్ని, చట్టపరమైన ప్రక్రియను లేదా ఆంక్ష విధించడానికి అవకాశం ఉన్న గవర్నమెంట్ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి కూడా (ఉదాహరణకు సమాచారాన్ని అందించాల్సిందిగా ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ నుండి మాకు చట్టపరమైన అభ్యర్థన అందితే) మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము.
- మీ సమ్మతి. మీరు వాయిస్ మ్యాచ్, మెమరీ వంటి కొన్ని ఫీచర్‌లను ఉపయోగించినప్పుడు, అలాగే అందరికీ Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి మీ ఆడియో & Live రికార్డింగ్‌లను ఉపయోగించడానికి Googleను అనుమతించినప్పుడు మీ సమ్మతిపై ఆధారపడతాము. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మీ సమ్మతిపై మేము ఆధారపడిన సందర్భాల్లో, మీ సమ్మతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకునే హక్కు మీకు ఉంటుంది.
మీ Gemini యాప్స్ చాట్స్, మీకు యాడ్స్‌ను చూపడానికి ఉపయోగించబడవు. ఇందులో మార్పు ఉంటే, మేము ఆ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాము.
మేము మా యూజర్‌ల డేటాను ఎలా ప్రైవేట్‌గా, సురక్షితంగా, భద్రంగా ఉంచుతాము అనే దాని గురించి తెలుసుకోవడానికి, మా గోప్యత, సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను చదవండి.
Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి, Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను రక్షించడానికి హ్యూమన్ రివ్యూ ఎలా ఉపయోగపడుతుంది
Google సర్వీస్‌లను మెరుగుపరచడంలో సహాయం చేయడానికి, కొన్ని చాట్‌లను హ్యూమన్ రివ్యూవర్‌లు రివ్యూ చేస్తారు. (వీరిలో Googleకు చెందిన ట్రెయినింగ్ పొందిన సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఉంటారు). వీటిలో Gemini మోడల్స్, Gemini యాప్స్ పని చేయడానికి సపోర్ట్ ఇచ్చే ఇతర జెనరేటివ్ AI మోడల్స్, అలాగే అనుకోకుండా జరిగే యాక్టివేషన్‌లను తగ్గించడానికి సహాయపడే టెక్నాలజీలు కూడా ఉంటాయి.
Gemini యాప్స్ సమాధానాలు తక్కువ క్వాలిటీతో ఉన్నాయా, సరికానివిగా, లేదా హాని కలిగించేవిగా ఉన్నాయా అని రివ్యూవర్లు అంచనా వేస్తారు. అలాగే వారు మెరుగైన సమాధానాలను కూడా సూచిస్తారు. భవిష్యత్తులో మా మోడల్స్ మెరుగైన సమాధానాలు ఇచ్చేలా చూడటానికి, వారి సూచనలను ఉపయోగిస్తాము. జెనరేటివ్ AI నిషేధిత వినియోగ పాలసీతో పాటు Google సర్వీస్ నియమాల ఉల్లంఘనలను గుర్తించి అరికట్టడానికి, అలాగే Geminiని అందరికీ సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి కూడా చాట్‌లను రివ్యూ చేస్తాము. రివ్యూ చేసిన చాట్‌లను మూడేళ్ల పాటు స్టోర్ చేస్తాము.
ఈ ప్రాసెస్‌లో మేము మీ గోప్యతను ఎలా సంరక్షిస్తాము
మీ గోప్యతకు మేము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాము, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము. సర్వీస్ ప్రొవైడర్‌లకు పంపే ముందు, చాట్‌లను మీ ఖాతా నుంచి డిస్‌కనెక్ట్ చేస్తాము.
రివ్యూవర్‌లకు షేర్ అయ్యే డేటాను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు
Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి మీరు భవిష్యత్తులో చేసే చాట్‌లను రివ్యూ చేయకుండా ఆపడానికి, యాక్టివిటీని సేవ్ చేయండి అనే సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి. ఒకవేళ ఆ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, గోప్యమైన డేటాను లేదా రివ్యూవర్ చూడకూడదు లేదా Google తన సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించకూడదు అని అనుకునే డేటాను ఎంటర్ చేయకండి. మీరు తాత్కాలిక చాట్‌లను కూడా ఉపయోగించవచ్చు. వీటిని రివ్యూవర్ల సహాయంతో Google AI టెక్నాలజీలను మెరుగుపరిచేందుకు ఉపయోగించము. తాత్కాలిక చాట్‌ల గురించి మరింత తెలుసుకోండి.
మీ 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్ట��ంగ్ ఆఫ్‌లో ఉన్నా లేదా మీరు తాత్కాలిక చాట్‌లను ఉపయోగించినా కూడా మీకు సమాధానం ఇవ్వడానికి, అలాగే Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను ప్రొటెక్ట్ చేయడానికి Google మీ చాట్‌లను ఉపయోగిస్తుంది. అవసరమైతే రివ్యూవర్ల సాయం కూడా తీసుకుంటుంది.
Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను ప్రొటెక్ట్ చేయడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి, అలాగే మీరు ప్రొవైడ్ చేసే ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను ప్రాసెస్ చేయడానికి Google ఈ చాట్‌లను స్టోర్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి:
యాక్టివిటీని సేవ్ చేయండి ఆఫ్‌లో ఉన్నప్పుడు మీరు చేసే తాత్కాలిక చాట్‌లు, రెగ్యులర్ చాట్‌లు మీ ఖాతాలో 72 గంటల పాటు స్టోర్ అయి ఉంటాయి, అవి ఇందుకోసం ఉపయోగపడతాయి:
- మీ చివరి 24 గంటల చాట్‌ను సందర్భోచితంగా ఉపయోగించి మీకు సమాధానమివ్వడం,
- Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను ప్రొటెక్ట్ చేయడం. ఉదాహరణకు, ఏదైనా సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అందుబాటులో ఉండేలా, Google మీ ఖాతాలో చాట్‌లను 72 గంటల పాటు స్టోర్ చేస్తుంది.
Google AI టెక్నాలజీల మోడల్స్‌ను ట్రెయిన్ చేయడానికి, తాత్కాలిక చాట్‌లను ఉపయోగించము. 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ ఆఫ్‌లో ఉండి, మీరు ఫీడ్‌బ్యాక్‌ను సబ్‌మిట్ చేయకపోతే, Google కూడా తన AI మోడల్స్‌ను మెరుగుపరచడానికి మీరు ఇకపై చేసే చాట్‌లను ఉపయోగించదు. తాత్కాలిక చాట్‌ను ఎలా ప్రారంభించాలి.
'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ ఆఫ్‌లో ఉండి, మీరు ఫీడ్‌బ్యాక్‌ను సబ్‌మిట్ చేయాలని ఎంచుకుంటే, Gemini యాప్స్‌ను మెయిన్‌టెయిన్ చేయడానికి, అలాగే వాటిని మెరుగుపరచడానికి Google ఈ కింది డేటాను కలెక్ట్ చేసి ఉపయోగిస్తుంది:
- మీ ఫీడ్‌బ్యాక్,
- గత 24 గంటల్లో మీరు చేసిన చాట్‌లతో సహా, మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సాయం చేసే కాంటెక్స్ట్, అలాగే
- ఆ చాట్‌లలో ఇన్‌క్లూడ్ చేసిన ఏదైనా కంటెంట్ ఈ డేటాలో ఉంటాయి (కనెక్టెడ్ యాప్స్ నుండి అప్‌లోడ్‌లు, డేటా వంటివి).
ఫీడ్‌బ్యాక్‌ను Google ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీ ఫీడ్‌బ్యాక్, ఏదైనా ఇన్‌క్లూడ్ చేసిన కంటెంట్ (ఉదా: ఫైల్స్ లేదా కనెక్టెడ్ యాప్స్ నుండి అందే మీ వ్యక్తిగత కంటెంట్), అనుబంధ సంభాషణలు (ఉదా: మీ ప్రాంప్ట్‌లు, Gemini యాప్స్ సమాధానాలు), అలాగే సంబంధిత డేటాను:
- ప్రత్యేక ట్రెయినింగ్ పొందిన టీమ్‌లలోని మెంబర్లు రివ్యూ చేస్తారు. సమస్యలుగా మారడానికి అవకాశం ఉన్న అంశాలను ఫీడ్‌బ్యాక్‌లో ఏమైనా మెన్షన్ చేసి ఉంటే వాటిని గుర్తించడానికి, పరిష్కరించడానికి, రిపోర్ట్ చేయడానికి హ్యూమన్ రివ్యూ అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ రివ్యూ చట్టం ప్రకారం తప్పనిసరి.
- Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగిస్తాము. Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను అందించడానికి, మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి Google ఈ డేటాను ఉపయోగిస్తుంది. దీని గురించి మా గోప్యతా పాలసీలో మరింత లోతుగా వివరించాము.
- ఉదాహరణకు, Gemini యాప్స్‌ను మరింత సురక్షితంగా చేయడానికి మేము ఈ డేటాను ఉపయోగిస్తాము. భవిష్యత్తులో సురక్షితం కాని రిక్వెస్ట్‌లను లేదా సమాధానాలను గుర్తించి, వాటిని నివారించడంలో ఇది మాకు సహాయపడుతుంది.
- 3 సంవత్సరాల దాకా స్టోర్ చేసి ఉంచుతాము. రివ్యూ అయిన ఫీడ్‌బ్యాక్, దానికి అనుబంధంగా ఉన్న సంభాషణలతో పాటు సంబంధిత డేటా, మీ Google ఖాతా నుండి డిస్‌కనెక్ట్ అయి 3 ఏళ్ల పాటు స్టోర్ అయి ఉంటుంది.
యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆన్‌లో ఉంటే:
మీ చాట్‌లు, అలాగే Geminiకి షేర్ చేసే సమాచారం (ఫైల్స్, వీడియోలు, స్క్రీన్‌లు, ఫొటోల వంటివి) మీ యాక్టివిటీలో సేవ్ అవుతాయి.
సేవ్ అయ్యే మీ యాక్టివిటీలో ఆడియో, Gemini Live వీడియోలు, స్క్రీన్ షేర్‌లు, ఫీడ్‌బ్యాక్, Gemini ద్వారా మీరు సందర్శించే వెబ్‌సైట్‌ల నుండి పొందిన సమాచారం, ప్రోడక్ట్ వినియోగంతో పాటు లొకేషన్ సమాచారం కూడా ఉంటుంది. (మీ డివైజ్ జనరల్ ఏరియా, IP అడ్రస్ లేదా మీ Google ఖాతాలోని ఇల్లు లేదా వర్క్ ప్లేస్ అడ్రస్‌లు కూడా లొకేషన్ సమాచారంలో ఉంటాయి).
మీ యాక్టివిటీని ఎలా ఉపయోగిస్తాము
Google మీ యాక్టివిటీని ఉపయోగించి దాని సర్వీస్‌లను అందిస్తుంది, డెవలప్ చేస్తుంది, అలాగే మెరుగుపరుస్తుంది (జనరేటివ్ AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడంతో సహా), అలాగే రివ్యూవర్‌ల సహాయంతో Googleను, దాని యూజర్‌లను, అలాగే పబ్లిక్‌ను రక్షించడానికి ఉపయోగిస్తుంది. సర్వీస్ ప్రొవైడర్‌లు రివ్యూ చేసిన డేటాను మీ ఖాతా నుండి డిస్‌కనెక్ట్ చేసి, 3 సంవత్సరాల వరకు సేవ్ చేసి ఉంచడం జరుగుతుంది. మీ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను ఆటోమేటిక్‌గా Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించరు. మీ సెట్టింగ్‌లు, ప్రాంతాన్ని బట్టి, Google మీ యాక్టివిటీని మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి కూడా ఉపయోగిస్తుంది.
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
మీ యాక్టివిటీని 18 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించడం జరుగుతుంది. మీరు దీన్ని 3 లేదా 36 నెలలకు మార్చవచ్చు లేదా ఆటోమేటిక్‌గా తొలగించకూడదని ఎంచుకోవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ను ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు లేదా Gemini యాప్స్ యాక్టివిటీలో మీ యాక్టివిటీని రివ్యూ చేసి, ఎప్పుడైనా తొలగించవచ్చు.
గుర్తుంచుకోండి
- Gemini యాప్స్ యాక్టివేట్ అయ్యే వరకు, అంటే అవి “Ok Google” లాంటి హాట్‌వర్డ్‌ను గుర్తించే వరకు స్టాండ్‌బై మోడ్‌లో వేచి ఉండేలా డిజైన్ చేశాము. యాక్టివేషన్‌కు కొన్ని సెకన్ల ముందు ఆడియో రికార్డింగ్‌లు ప్రారంభం కావచ్చు.
- "Ok Google" వంటి శబ్దాన్ని గుర్తిస్తే, Gemini అనుకోకుండా (యాక్సిడెంటల్‌గా) యాక్టివేట్ కావచ్చు. ఈ రికార్డింగ్‌ల టైప్ చేసిన మాటల ఫైళ్లను అనుకోకుండా జరిగే యాక్టివేషన్‌లను తగ్గించడంలో ప్రతి ఒక్కరికి సహాయపడే విషయంలో కూడా ఉపయోగించడం జరుగుతుంది.
- ఈ సెట్టింగ్‌ను ఆన్ చేస్తే, గతంలో కనెక్ట్ అయిన యాప్స్‌కు Gemini తిరిగి యాక్సెస్‌ను పొందుతుంది.
యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆఫ్‌లో ఉంటే:
మీరు Google ఫీడ్‌బ్యాక్‌ను పంపాలని ఎంచుకుంటే తప్ప, మీ భవిష్యత్ చాట్‌లు మీ యాక్టివిటీలో కనిపించవు, అలాగే మా AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడవు. భవిష్యత్ చాట్‌లు ఇప్పటికీ 72 గంటల పాటు సేవ్ చేయబడతాయి, తద్వారా Gemini మీకు సమాధానం ఇవ్వగలదు, మీ ఫీడ్‌బ్యాక్‌ను ప్రాసెస్ చేయగలదు, Google, దాని యూజర్‌లను, ఇంకా పబ్లిక్‌ను రక్షించగలదు.
గుర్తుంచుకోండి
- మీరు మీ యాక్టివిటీని తొలగిస్తే, సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికే రివ్యూ చేసిన పాత చాట్‌లు డిలీట్ కావు. ఎందుకంటే అవి మీ Google ఖాతా��ు కనెక్ట్ అయి ఉండవు. డిలీట్ కావడానికి బదులు, అవి 3 ఏళ్ల పాటు స్టోర్ అయి ఉంటాయి.
- ఈ సెట్టింగ్ ఆఫ్‌లో ఉంటే కొన్ని కనెక్టెడ్ యాప్స్ అందుబాటులో ఉండవు.
- మీరు ఇతర Google సర్వీస్‌లను వినియోగిస్తున్నప్పుడు, వెబ్ & యాప్ యాక్టివిటీ లేదా లొకేషన్ హిస్టరీ వంటి ఇతర సెట్టింగ్‌లు లొకేషన్‌ను, ఇతర డేటాను సేవ్ చేయడం కొనసాగించే అవకాశం ఉంది.
- 'యాక్టివిటీని సేవ్ చేయండి'ని ఆఫ్ చేయడం లేదా Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించడం వల్ల ఇతర Google సర్వీస్‌లలో డేటా తొలగిపోదు. Google సర్వీస్‌లు డేటాను ఎలా స్టోర్ చేసి ఉంచుతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
- మీ నోట్‌బుక్‌లకు మీరు యాడ్ చేసే సోర్స్ ఫైల్స్ Gemini Notebookలో సేవ్ అవుతాయి. Gemini Notebooks గోప్యత, వినియోగ నియమాలను చూడండి.
- 'యాక్టివిటీని సేవ్ చేయండి'ని ఆఫ్ చేయడం లేదా Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించడం వల్ల మీ రిమోట్ బ్రౌజర్, రిమోట్ కంప్యూటర్ డేటా సెట్టింగ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.
మీరు ఏ సమయంలోనైనా ఈ సెట్టింగ్‌ను మేనేజ్ చేయవచ్చు.
Gemini యాప్స్ యాక్టివిటీలో ఉండే మీ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను ఉపయోగించేందుకు మీరు Googleను అనుమతించవచ్చు. దీనివల్ల అందరి కోసం Google సర్వీసులను మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేస్తే:
Gemini యాప్స్ యాక్టివిటీలో ఉన్న మీ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను Google ఉపయోగిస్తుంది. వీటి ద్వారా తన సర్వీస్‌లను మెరుగుపరుస్తుంది, డెవలప్ చేస్తుంది (జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడం కూడా ఇందులో ఉంటుంది). Google ఉపయోగించే ఈ డేటాలో ఇప్పటికే Gemini యాప్స్ యాక్టివిటీలో స్టోర్ అయి ఉన్నవి, వాటితో పాటు భవిష్యత్తులో స్టోర్ అయ్యే ఆడియో, Gemini Live వీడియోలు, స్క్రీన్‌షేర్‌లు కూడా ఉంటాయి.
కొంత ఆడియోను, కొన్ని Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను రివ్యూవర్‌లు రివ్యూ చేస్తారు. మీ గోప్యతను రక్షించడానికి, సర్వీస్ ప్రొవైడర్‌లకు పంపిన యాక్టివిటీని మీ Google ఖాతాకు కనెక్ట్ చేయము.
గుర్తుంచుకోండి
- యాక్టివేట్ అయ్యే దాకా, అంటే “Ok Google” లాంటి హాట్‌వర్డ్‌ను గుర్తించే దాకా స్టాండ్‌బై మోడ్‌లో ఉండేలా Gemini యాప్స్‌ను డిజైన్ చేశాము. యాక్టివేషన్ మొదలు కావడానికి కొన్ని సెకన్ల ముందు నుండే ఆడియో రికార్డింగ్‌లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
- "Ok Google" వంటి శబ్దాన్ని గుర్తిస్తే, Gemini అనుకోకుండా (యాక్సిడెంటల్‌గా) యాక్టివేట్ కావచ్చు. ఇలా అనవసరంగా జరిగే యాక్టివేషన్‌లను తగ్గించి, యూజర్లు అందరికీ సాయపడేందుకు ఈ రికార్డింగ్‌లను కూడా ఉపయోగిస్తాము.
- మీరు వాయిస్ మ్యాచ్ ద్వారా Geminiని ఉపయోగిస్తే, మీ వాయిస్ మోడల్‌ను, వాయిస్ మ్యాచ్‌ను మెరుగుపరచేందుకు ��ెంపరరీగా (తాత్కాలికంగా) ఉపయోగిస్తాము.
- ఈ సెట్టింగ్, ఇతర సర్వీసుల్లోని మీ సెట్టింగ్‌లతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, వాయిస్, ఆడియో, Gemini Live రికార్డింగ్‌ల ద్వారా Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడే Gemini for Home సెట్టింగ్‌కు దీనితో సంబంధం లేదు. మీరు ఆ సెట్టింగ్‌ను మీ Google Home హిస్టరీలో మేనేజ్ చేయవచ్చు.
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
మీరు ఏ సమయంలోనైనా ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయవచ్చు లేదా మీ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను మేనేజ్ చేయవచ్చు, తొలగించవచ్చు.
మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే:
Gemini యాప్స్ యాక్టివిటీలోని మీ భవిష్యత్ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను AI మోడల్స్‌తో సహా మా సర్వీసులను మెరుగుపరచడానికి ఉపయోగించము. మీరు Googleకు ఫీడ్‌బ్యాక్‌ను పంపినప్పుడు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.
గుర్తుంచుకోండి
- మీకు సమాధానం ఇవ్వడానికి, Geminiని సురక్షితంగా ఉంచడానికి, ఇప్పటికీ మీ భవిష్యత్ ఆడియోను, Gemini Live వీడియోలను, స్క్రీన్ షేర్‌లను ఉపయోగిస్తాము.
- Gemini యాప్స్ యాక్టివిటీలోని మీ Live చాట్‌ల టైప్ చేసిన మాటల ఫైల్స్, మీరు Gemini యాప్స్‌తో షేర్ చేసే ఏదైనా ఇతర కంటెంట్ యాక్టివిటీని సేవ్ చేయండి అనే సెట్టింగ్ పరిధిలోకి వస్తాయి, మీరు దీన్ని ఏ సమయంలోనైనా ఆఫ్ చేయవచ్చు.
- ఈ సెట్టింగ్, ఇతర సర్వీసుల్లోని మీ సెట్టింగ్‌లతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, దీన్ని ఆఫ్ చేయడం వల్ల వాయిస్, ఆడియో, Gemini Live రికార్డింగ్‌ల ద్వారా Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడే Gemini for Home సెట్టింగ్ ఆఫ్ అవ్వదు. మీరు ఆ సెట్టింగ్‌ను మీ Google Home హిస్టరీలో ఆఫ్ చేయవచ్చు.
మీ ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అనుకూలంగా మార్చడానికి, అలాగే షెడ్యూల్ అయిన చర్యలను, టాస్క్‌లను పూర్తి చేయడం వంటి పనుల్లో మీకు సాయం చేయడానికి Gemini యాప్స్ మీ సూచనలను (కొన్ని ప్రాంతాల్లో "సేవ్ చేసిన సమాచారాన్ని") ఉపయోగిస్తాయి. మీరు తొలగించే వరకు, ఈ డేటా సేవ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సూచనలను సేవ్ చేయడాన్ని ఆపివేయవచ్చు. మరింత తెలుసుకోండి.
Gemini యాప్స్ యాక్టివిటీలో మీ చాట్‌లను రెఫర్ చేయడం ద్వారా, వాటిని ఉపయోగించి పర్సనలైజ్ చేసిన గణాంకాలను జెనరేట్ చేయడం ద్వారా Gemini మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయగలదు, పనులను (టాస్క్‌ల వంటివి) పూర్తి చేయడంలో మీకు సహాయపడగలదు. ఈ మెమరీ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మెమరీ ఆన్‌లో ఉంటే:
- మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడానికి, Gemini మీరు చాట్‌లలో ప్రొవైడ్ చేసిన గోప్యమైన (సెన్సిటివ్) సమాచారాన్ని ఉపయోగించే అవకాశం ఉంది.
- మీరు ఇచ్చే సమాచారాన్ని Gemini గుర్తుంచుకోకూడదు అని లేదా మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడానికి ఉపయోగించకూడదు అని భావిస్తే, తాత్కాలిక చాట్‌ను ప్రారంభించవచ్చు.
- గత చాట్ నుండి సమాచారాన్ని ఉపయోగించి Gemini మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడం ఆపడానికి, ఆ చాట్‌ను తొలగించండి.
మీరు సైన్ అవుట్ చేసి Gemini యాప్స్‌ను ఉపయోగించినప్పుడు, Google మీ డేటాను (మీ IP అడ్రస్, బ్రౌజర్ రకం వంటివి) Google గోప్యతా పాలసీ ప్రకారం ప్రాసెస్ చేస్తుంది. మీ డేటా, మీ Google ఖాతాతో అనుబంధమై ఉండదు. Gemini యాప్స్ గోప్యతా ప్రకటన వర్తించదు.
లొకేషన్, ఇతర అనుమతుల సమాచారం
Gemini యాప్స్ ఏ లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తాయి, అది ఎందుకు, ఎలా ఉపయోగించబడుతుంది?మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించినప్పుడల్లా, లొకేషన్ డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుంది, తద్వారా అవి మీ క్వెరీకి తగిన సమాధానాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, "వాతావరణం ఎలా ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి, Gemini యాప్స్‌కు మీ లొకేషన్‌ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
Gemini యాప్స్, లొకేషన్ డేటాను ఎక్కడ పొందుతాయి, ఆ డేటాను ఎలా ఉపయోగిస్తాయి
Gemini యాప్స్ కలెక్ట్ చేసే లొకేషన్ డేటాకు చెందిన సోర్స్ అనేది, మారుతూ ఉంటుంది. "వాతావరణం ఎలా ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు సమాధానాలను ��వ్వడం కోసం Gemini యాప్స్ ఆటోమేటిక్‌గా మీ IP అడ్రస్, లేదా మీ Google ఖాతాలోని ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ల నుండి జనరల్ ఏరియాను ఉపయోగిస్తాయి
మీ అనుమతి పొందిన తర్వాత, మీ డివైజ్‌కు చెందిన ఖచ్చితమైన లొకేషన్‌ను కూడా Gemini యాప్స్ ప్రాసెస్ చేస్తాయి. ఉదాహరణకు, "నాకు అత్యంత సమీపంలోని కాఫీ షాప్ ఎక్కడ ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు మరింత ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి Gemini యాప్స్ మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించవచ్చు. Google యాప్‌లో ఖచ్చితమైన లొకేషన్ సెట్టింగ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ Google Maps వంటి మరొక Google సర్వీస్ నుండి కూడా Gemini ఖచ్చితమైన లొకేషన్ డేటాను పొందే అవకాశం ఉంది
Google మీ ఖచ్చితమైన లొకేషన్ డేటాతో సహా, మీ లొకేషన్ డేటాను Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో వివరించిన ప్రయోజనాల కోసం, చట్టపరమైన ప్రాతిపదికలకు అనుగుణంగా ఉపయోగిస్తుంది. లొకేషన్ డేటా గురించి మరింత తెలుసుకోవడానికి g.co/privacypolicy/location లింక్‌కు వెళ్లండి .
Gemini యాప్స్ మీ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి Google Maps వంటి మరొక Google సర్వీస్‌తో మీ ఖచ్చితమైన లొకేషన్ డేటాను షేర్ చేసే అవకాశం ఉంది. మీ లొకేషన్ డేటాను పొందే Google సర్వీస్ దానిని Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగిస్తుంది.
Google యాప్‌లోని ఖచ్చితమైన లొకేషన్ సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ మీ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి Google Maps వంటి మరొక Google సర్వీస్ నుండి Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను అందుకోవచ్చు.
లొకేషన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది
- మీ అనుమతితో మీ డివైజ్ లేదా బ్రౌజర్ ద్వారా సేకరించిన ఖచ్చితమైన లొకేషన్ మీ Gemini Apps యాక్టివిటీలో స్టోర్ అవ్వదు.
- Gemini Apps ప్రాసెస్ చేసే లొకేషన్ డేటా, మీ యాక్టివిటీలో సేవ్ కావడానికి ముందే జనరల్ ఏరియాగా మారుతుంది. జనరల్ ఏరియా 3 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో, కనీసం 1000 మంది యూజర్‌లను కలిగి ఉంటుంది, తద్వారా మీ ప్రాంప్ట్ జనరల్ ఏరియా మిమ్మల్ని గుర్తించదు, ఇది మీ గోప్యతను రక్షించడంలో సహాయపడుతుంది. జనరల్ ఏరియాను నగరాల వెలుపల పరిగణించినట్లయితే, అది సాధారణంగా 3 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్రాంతాన్ని సూచిస్తుందని దీని అర్థం.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, మీరు వీటిని చేయవచ్చు:
- Gemini మొబైల్, Google Maps వంటి మీ మొబైల్ యాప్‌లకు సంబంధించిన లొకేషన్ అనుమతులను మేనేజ్ చేయండి. డివైజ్ లొకేషన్ సెట్టింగ్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి, Gemini మీ డివైజ్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు వర్తించే మొబైల్ అనుమతులను మేనేజ్ చేయండి.
- మీ Gemini యాప్స్ యాక్టివిటీని రివ్యూ చేయడం, తొలగించడం. మీ Gemini యాప్స్ యాక్టివిటీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.
తెలుసుకోవాల్సిన విషయాలు
మీరు ఇచ్చే ప్రాంప్ట్‌లలో లేదా మీకు వచ్చే సమాధానాలలో లొకేషన్ ప్రస్తావన ఉన్నట్లయితే, అది మీ చాట్స్‌లో సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు Gemini యాప్స్‌ను "నాకు సమీపంలో ఉన్న" రెస్టారెంట్‌ల గురించి అడిగినప్పుడు, ఆ సమాధానంలో మీ నగరం పేరు ఉంటే అది స్టోర్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏ సమయంలోనైనా మీ Gemini యాప్స్ యాక్టివిటీని మేనేజ్ చేయవచ్చు, తొలగించవచ్చు.
మీ ఖచ్చితమైన లొకేషన్‌ను Gemini యాప్స్ యాక్సెస్ చేస్తున్నాయా, చేస్తుంటే ఉపయోగిస్తున్నాయా అన్నది చెక్ చేయండి.
వీటిలో చెక్ చేయడం ఎలా:
- Gemini వెబ్ యాప్
- Android డివైజ్‌లో Gemini మొబైల్ యాప్
- iPhoneలో లేదా iPadలో Gemini మొబైల్ యాప్
- WearOS డివైజ్‌లో Gemini
- Chromeలో Gemini
- బిల్ట్-ఇన్ Google
పైన పేర్కొన్న ఖచ్చితమైన లొకేషన్ సెట్టింగ్‌లు ఆఫ్‌లో ఉన్నప్పటికీ మీ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి Android Auto వంటి మరొక Google సర్వీస్ నుండి Gemini మీ ఖచ్చితమైన లొకేషన్ డేటాను అందుకోవచ్చు. బిల్ట్-ఇన్ Googleలో, అలాగే Android Autoలో ఖచ్చితమైన లొకేషన్‌ను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండి.
Google Messagesలో Gemini
Google Messagesలోని Geminiకి మీ ఖచ్చితమైన లొకేషన్‌కు యాక్సెస్ లేదు. 'Google Messagesలో Gemini' ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోండి.
మీ లొకేషన్ గురించి, దానిని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
Gemini మొబైల్ యాప్ (Androidలో)
మీరు Gemini యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ, Geminiని Google యాప్ హోస్ట్ చేస్తోంది. మీ Google యాప్ అనుమతుల ఆధారంగా, మీ డివైజ్‌లోని అనేక ఫీచర్‌లను, సామర్థ్యాలను (మీ కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్‌లు, లేదా లొకేషన్ వంటివి) Gemini, Google యాప్ ఉపయోగించగలవు. ఈ అనుమతులను రివ్యూ చేయడంతో సహా మేనేజ్ చేయడానికి:
- Google యాప్
ను నొక్కి, పట్టుకోండి.
- యాప్ సమాచారం
అనుమతులను ట్యాప్ చేయండి.
- ఏదైనా అనుమతి సెట్టింగ్‌ను మార్చడానికి, దాన్ని ట్యాప్ చేసి, అనుమతించండిని కానీ, లేదా అనుమతించవద్దును కానీ ఎంచుకోండి.
అప్‌లోడ్‌లు
నేను అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌లతో Google ఏమేమి చేస్తుంది?ప్రాంప్ట్‌లలో ఇమేజ్‌లను జోడించడం అనేది ఎలా పని చేస్తుంది
మీ ప్రాంప్ట్‌కు ఇమేజ్‌ను యాడ్ చేయవచ్చు. దాని మీద Geminiని ప్రశ్నలు అడగవచ్చు. దాన్ని ఎడిట్ చేయి అని కూడా అడగొచ్చు. అంతే కాదు దాని ఆధారంగా వీడియో లాంటి ఇతర కంటెంట్‌ను కూడా జెనరేట్ చేయి అని చెప్పవచ్చు. మీరు, ప్రాంప్ట్‌లో ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేసినప్పుడు, లేదా "ఈ స్క్రీన్ గురించి అడగండి" వంటి చర్యల ద్వారా స్క్రీన్‌షాట్‌ను జోడించినప్పుడు, ఇమేజ్‌లో ఏముందో అర్థం చేసుకోవడానికి, అలాగే టెక్స్ట్‌ను రీడ్ చేయడానికి Gemini యాప్స్ Google Lens టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాయి. Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో వివరించినట్లుగా, Google ఈ సమాచారాన్ని కూడా ఇతర ప్రాంప్ట్ లాగానే ఉపయోగిస్తుంది.
కనెక్ట్ అయిన ఏదైనా మీడియా గ్యాలరీ యాప్ (Google Photos వంటి వాటి) నుండి మీరు ఏదైనా ఫోటోను లేదా వీడియోను Gemini యాప్స్‌తో షేర్ చేస్తే, మీ ఫోటో లేదా వీడియో Gemini యాప్స్ గోప్యతా ప్రకటన ప్రకారం ప్రాసెస్ అవుతుంది. ఉదాహరణకు, మీరు స్క్రీన్ చర్యలు అనే ఫీచర్‌ను ఉపయోగిస్తే లేదా Gemini అప్‌లోడ్ ఫీచర్ ద్వారా ఏదైనా మీడియా గ్యాలరీ యాప్ నుండి Gemini యాప్స్‌కు ఒక ఫోటోను లేదా వీడియోను షేర్ చేస్తే, మీ యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి గాను, మీ ఫోటోను లేదా వీడియోను రివ్యూవర్‌ల సహాయంతో ఉపయోగించడం జరుగుతుంది. 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ గురించి మరింత తెలుసుకోండి.
Geminiలో కనెక్టెడ్ యాప్స్
నా డేటాను Gemini, కనెక్టెడ్ యాప్స్, ఇతర సర్వీస్‌లు ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది?మీకు తగిన విధంగా సాయం చేయడానికి, మీ కోసం సమాచారాన్ని కనుగొనడానికి, ఇలాంటి మరిన్ని పనులు చేయడానికి కనెక్టెడ్ యాప్స్‌ను, ఇతర సర్వీస్‌లను Gemini ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీరు Google Workspaceకు లేదా Google Photosకు కనెక్ట్ అయితే, మీ ఈమెయిల్స్‌లో లేదా ఫోటోల్లో ఉన్న సమాచారాన్ని చూడటానికి Geminiని ఉపయోగించవచ్చు. మీరు ఫ్లయిట్స్, హోటల్స్ గురించి సిఫార్సులను (రెకమెండ్ చేయమని) అడిగితే, Gemini మీకు తగిన విధంగా సాయం చేయడానికి Google Flightsలో, Google Hotelsలో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
ఏ డేటా షేర్ అవుతుంది
Geminiకి, కనెక్టెడ్ యాప్స్‌కు, ఇతర Google సర్వీస్‌లకు మధ్య షేర్ అయ్యే డేటాలో ఇవి ఉంటాయి:
- మీ Gemini చాట్‌లలో ఉండే సమాచారం
- మీ డివైజ్, భాష వంటి మీ ప్రాధాన్యతల (ప్రిఫరెన్స్‌ల) సమాచారం
- మీ లొకేషన్ సమాచారం
- మీ కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే సమాచారం & కంటెంట్ (ఈమెయిల్స్, ఫైల్స్, ఈవెంట్లు, ఫోటోలు, వీడియోల లాంటివి)
మీ డేటాను ఎలా ఉపయోగిస్తారు
కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే డేటాను Gemini తన Gemini యాప్స్ గోప్యతా ప్రకటన ప్రకారం ఉపయోగిస్తుంది. మీకు తగిన విధంగా సాయం చేయడానికి, మీ కోసం సమాచారాన్ని కనుగొనడానికి, ఇలాంటి మరిన్ని పనులు చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. మీరు నిర్దిష్టంగా కావలసిన అర్హతలకు అనుగుణంగా ఉండి, నిర్దిష్టమైన కనెక్టెడ్ యాప్స్ ద్వారా పర్సనలైజేషన్‌కు అనుమతి ఇస్తే, ఆ కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే డేటాను కూడా మీ Gemini ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయడానికి Google ఉపయోగిస్తుంది, అలాగే మీరు Gemini Sparkను లేదా Chromeలో Geminiని ఉపయోగించినప్పుడు, మీ కోసం పనులు చేస్తుంది.
Gemini, ఇతర Google సర్వీస్‌లకు షేర్ చేసే డేటాను, Google గోప్యతా పాలసీ ప్రకారం ఉపయోగిస్తారు. ఈ సర్వీసుల్లో ప్రోడక్ట్ మెరుగుదల కూడా ఉంటుంది. మీ కోసం పనులు చేయమని మీరు Geminiని అడిగినప్పుడు, మీ టాస్క్‌లను పూర్తి చేయడంలో సహాయపడటానికి Gemini మీ తరఫున అవసరమైన డేటాను ఇతరులకు షేర్ చేస్తుంది. థర్డ్-పార్టీ యాప్‌లు వాటి స్వంత గోప్యతా పాలసీలకు, నియమాలకు అనుగుణంగా Gemini నుండి వచ్చే డేటాను ఉపయోగిస్తాయి.
మీ కనెక్టెడ్ యాప్స్‌ను ఎలా మేనేజ్ చేయాలి
కనెక్టెడ్ యాప్స్ సెట్టింగ్స్‌లో మీరు యాప్‌లను కనెక్ట్ చేయవచ్చు, అలాగే డిస్‌కనెక్ట్ కూడా చేయవచ్చు. ఏ యాప్‌లతో కలిసి Gemini వర్క్ చేయాలి అనే అంశాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి.
యాక్టివిటీని సేవ్ చేయండి ఆన్‌లో ఉన్నా, ఆఫ్‌లో ఉన్నా, కొన్ని కనెక్టెడ్ యాప్స్, ఉదా, ఫోన్, Messages, WhatsApp, యుటిలిటీస్ వంటివి మీ Android మొబైల్ డివైజ్‌లో అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో, మీరు యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే, Google Workspace వంటి కనెక్టెడ్ యాప్స్ ��ందుబాటులో ఉండవు. మళ్లీ 'యాక్టివిటీని సేవ్ చేయండి'ని ఆన్ చేస్తే, గతంలో కనెక్ట్ అయిన యాప్స్‌కు Gemini యాక్సెస్ రీ-స్టోర్ అవుతుంది.
యాప్‌లను డిస్‌కనెక్ట్ చేయడం & డేటాను తొలగించడం
- కనెక్టెడ్ యాప్స్ సెట్టింగ్స్‌లో యాప్‌లను ఎలా డిస్‌కనెక్ట్ చేయాలో తెలుసుకోండి.
- ఒక యాప్‌ను డిస్‌కనెక్ట్ చేయడం వల్ల లేదా కనెక్టెడ్ యాప్‌లోని డేటాను తొలగించడం వల్ల Gemini యాప్స్ యాక్టివిటీ నుండి ఏ డేటా కూడా తొలగిపోదు.
- మీరు ఏ సమయంలోనైనా మీ Gemini యాప్స్ యాక్టివిటీని మేనేజ్ చేయవచ్చు, తొలగించవచ్చు.
- యాప్‌లకు Gemini షేర్ చేసే డేటాను, సదరు యాప్‌లు వాటి స్వంత పాలసీలకు అనుగుణంగా స్టోర్ చేస్తాయి. Gemini యాప్స్ యాక్టివిటీలోని డేటాను తొలగించడం వల్ల Gemini నుండి ఇతర యాప్‌లకు వెళ్లిన డేటా తొలగిపోదు. సేకరించిన డేటాను Google సర్వీస్‌లు ఎలా స్టోర్ చేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
- ఒక కనెక్టెడ్ యాప్ నుండి వచ్చిన డేటాలో Gemini మీ గురించి గుర్తుంచుకున్న ఏదైనా అంశాన్ని తొలగించడం ఎలాగో తెలుసుకోండి. మీరు Gmailలోని ఈమెయిల్ లేదా Google Photosలోని ఫోటో వంటి డేటాను ఏదైనా కనెక్టెడ్ యాప్‌లో తొలగించినా లేదా అప్‌డేట్ చేసినా, ఆ మార్పుల ప్రభావం Geminiలో మీ ఎక్స్‌పీరియన్స్‌పై కనిపించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.
తెలుసుకోవాల్సిన విషయాలు
- ఇతర సర్వీస్‌లకు షేర్ అయిన కంటెంట్‌ను మార్చమని, లేదా షేర్ అయిన డివైజ్‌లను కంట్రోల్ చేయమని మీరు Gemini యాప్స్‌కు చెబితే, సదరు షేర్‌డ్ కంటెంట్‌కు లేదా డివైజ్‌కు యాక్సెస్ ఉన్న వారు ఎవరైనా ఆ చర్యలను చూడటానికి అవకాశం ఉంది.
- అనుకూల (కస్టమ్) కనెక్టెడ్ యాప్‌ను జోడించడం కోసం, ఏదైనా థర్డ్-పార్టీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (MCP) సర్వర్‌ను కనెక్ట్ చేసే ముందు, ఆ థర్డ్-పార్టీ నమ్మదగినదేనా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించం���ి. అలాగే, ఆ సర్వర్ ద్వారా జరిగే చర్యల గురించి మీకు పూర్తి అవగాహన ఉందని నిర్ధారించుకోండి. Google ఈ సర్వర్‌లను కంట్రోల్ చేయదు, మానిటర్ చేయదు లేదా వాటికి భద్రత కల్పించదు.
"పర్సనల్ ఇంటెలిజెన్స్" ఫీచర్ ఉన్న, అర్హత గల యూజర్లు, కొన్ని Google యాప్‌లను Geminiకి కనెక్ట్ చేయవచ్చు. తద్వారా కనెక్టెడ్ యాప్స్ సాయంతో Geminiలో గతంలో అందుబాటులో లేని సరికొత్తగా ఉన్న, మరింతగా పర్సనలైజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌లను పొందవచ్చు. కనెక్టెడ్ యాప్స్ నుండి వచ్చే మీ డేటాతో పర్సనలైజేషన్ పొందడం గురించి మరింత తెలుసుకోండి.
ఏ డేటా కలెక్ట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది
Geminiలో మీరు కనెక్టెడ్ యాప్స్‌ను ఉపయోగించినప్పుడు, కాల్స్ చేయడానికి / మెసేజ్‌లు పంపడానికి మీకు సాయం చేసేందుకు, "Gemini మొబైల్ యాప్స్" ఈ సమాచారాన్ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తాయి:
- Gemini యాప్స్ యాక్టివిటీ (అందుబాటులో ఉంటే)
- డివైజ్ కాలింగ్ & మెసేజింగ్ లాగ్స్
- కాంటాక్ట్ సమాచారం
- డివైజ్ సమాచారం & సెట్టింగ్స్
మీరు గతంలో కాల్స్ చేయడానికి / మెసేజ్‌లు పంపడానికి Google Assistantను ఉపయోగించి ఉంటే, మీ వెబ్ & యాప్ యాక్టివిటీలో సేవ్ అయి ఉన్న "Google Assistant కమ్యూనికేషన్‌ల రిక్వెస్ట్ హిస్టరీ" మీ Gemini యాప్స్ యాక్టివిటీకి ఇంపోర్ట్ (దిగుమతి) అయ్యే అవకాశం ఉంది. ఉదా, "రాణికి మెసేజ్ పంపు" లాంటివి. ఈ యాక్టివిటీ, గరిష్ఠంగా 90 రోజులకు సంబంధించినది అయి ఉంటుంది. Google సర్వీస్‌ల నుండి Gemini యాప్స్ ఎలా సాయం పొందుతాయో మరింత తెలుసుకోండి.
డేటాను ఎలా ఉపయోగిస్తారు
కనెక్టెడ్ యాప్స్‌ను ఉపయోగించి కాల్స్ చేయడానికి / మెసేజ్‌లు పంపడానికి, మీ డేటాను Gemini మొబైల్ యాప్స్, ఇందుకోసం ఉపయోగిస్తాయి:
- బాగా ఉపయోగపడే కాలింగ్ / మెసేజింగ్ యాప్‌ను ఎంచుకోవడానికి అలాగే
- సరైన వ్యక్తితో మిమ్మల్ని కనెక్ట్ చేయడంలో సాయం చేసేందుకు.
Gemini యాప్‌లో మీరు క్రియేట్ చేసే మెసేజ్‌లను, పంపే మెసేజ్‌లను Google పూర్తి స్థాయిలో (ఎండ్-టు-ఎండ్) ఎన్‌క్రిప్ట్ చేయదు.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
- కాల్స్ చేయడానికి / మెసేజ్‌లు పంపడానికి Gemini మొబైల్ యాప్స్, మీ యాక్టివిటీని ఉపయోగించుకూడదు అని మీరు భావిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యాక్టివిటీని Gemini యాప్స్ యాక్టివిటీలో తొలగించవచ్చు.
- సపోర్ట్ ఉన్న కాలింగ్ & మెసేజింగ్ యాప్‌లను మీరు కనెక్టెడ్ యాప్స్ సెట్టింగ్‌లలో ఏ సమయంలోనైనా డిస్‌కనెక్ట్ చేయవచ్చు. Geminiలో కనెక్టెడ్ యాప్స్‌ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.
- యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ మీ మొబైల్ డివైజ్‌లో సపోర్ట్ ఉన్న కాలింగ్ & మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు.
- యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌వాచ్‌లో కాలింగ్ & మెసేజింగ్ యాప్‌లు అందుబాటులో ఉండవు.
ముఖ్య గమనిక: లాక్ స్క్రీన్‌పై Assistant సెట్టింగ్స్ లాంటి Google Assistant సెట్టింగ్స్ Geminiకి కనెక్ట్ అయిన యాప్‌లకు వర్తించవు.
Gemini Spark
రిమోట్ బ్రౌజర్, రిమోట్ కంప్యూటర్‌తో Gemini Spark నా డేటాను ఎలా ఉపయోగిస్తుంది?మీరు బీటా Gemini Spark ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు, మీ టాస్క్‌లను పూర్తి చేయడంలో, కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేయడంలో సహాయపడటానికి Gemini, రిమోట్ బ్రౌజర్‌ను లేదా రిమోట్ కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు. యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. Gemini Spark గురించి మరింత తెలుసుకోండి.
మీరు macOSలో బీటా Gemini Spark ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు, మీ కనెక్టెడ్ ఫోల్డర్‌లకు జోడించే లోకల్ ఫైల్స్‌తో Gemini నేరుగా ఇంటరాక్ట్ అవ్వగలదు. ఉదాహరణకు, Gemini మీ లోకల్ ఫైల్స్‌ను మీ కోసం ఎడిట్ చేయగలదు, ఆర్గనైజ్ చేయగలదు. macOSలో Gemini Spark గురించి మరింత తెలుసుకోండి.
ఏ రకమైన డేటా ప్రాసెస్ అవుతుంది
మీరు Sparkను ఉపయోగించినప్పుడు, Gemini మీ టాస్క్‌లు, షెడ్యూల్స్, సూచనల సెట్‌లు, రిమోట్ బ్రౌజర్, రిమోట్ కంప్యూటర్ నుండి సమాచారాన్ని ఉపయోగిస్తుంది. వీటితో పాటు కనెక్టెడ్ యాప్స్, పర్సనల్ ఇంటెలిజెన్స్, అలాగే మీరు లాగిన్ అయి ఉన్న వాటితో సహా అది ఇంటరాక్ట్ అయ్యే ఇతర వెబ్‌సైట్‌ల వంటి అందుబాటులో ఉన్న ఏవైనా ఇతర సోర్స్‌ల నుండి కూడా సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
- రిమోట్ బ్రౌజర్: Gemini మీ బ్రౌజర్ సెషన్ నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది, ఉదాహరణకు మీ వెబ్‌సైట్ ప్రామాణీకరణ సమాచారం, పేజీ కంటెంట్ ఉన్న కుక్కీలు వంటివి.
- రిమోట్ కంప్యూటర్: Gemini మీ టాస్క్‌లకు సంబంధించిన .md ఫైల్స్‌ను, కోడ్‌ను, ఇతర సమాచారాన్ని సేవ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేవ్ చేసిన ఈ సమాచారంలో పర్సనల్ ఇంటెలిజెన్స్, కనెక్టెడ్ యాప్స్ వంటి సోర్స్‌ల నుండి మీరు గోప్యమైనదిగా భావించే డేటా ఉండవచ్చు, మీ టాస్క్‌లను అర్థం చేసుకోవడానికి, ప్రాసెస్ చేయడానికి Spark ఉపయోగించే సోర్స్‌లు ఇవి.
ఈ డేటాను Gemini యాప్స్ గోప్యతా ప్రకటనకు అనుగుణంగా ఉపయోగిస్తాము, భవిష్యత్తు చాట్‌లలో రిమోట్ బ్రౌజర్‌ను, రిమోట్ కంప్యూటర్‌ను ఉపయోగించడాన్ని మీకు సులభతరం చేయడానికి కూడా ఈ డేటాను ఉపయోగిస్తాము. మీ Gemini Spark సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీరు ఈ డేటాను తొలగించవచ్చు.
ఏ డేటా షేర్ అవుతుంది
మీ కనెక్టెడ్ యాప్స్, రిమోట్ బ్రౌజర్‌తో చేసే వాటితో సహా మీ టాస్క్‌లను పూర్తి చేయడానికి, Gemini ఇతర సర్వీస్‌లతో, థర్డ్-పార్టీలతో అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తుంది, ఇందులో మీ పేరు, అడ్రస్ లేదా మీరు గోప్యమైనదిగా భావించే సమాచారం వంటి డేటా ఉండవచ్చు. ఈ సమాచారంలో మీ కనెక్టెడ్ యాప్స్, రిమోట్ కంప్యూటర్ ఫైల్స్ నుండి డేటా ఉండవచ్చు.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
రిమోట్ బ్రౌజర్: ప్రాంప్ట్ టెక్స్ట్ బాక్స్‌లో ఆపివేయండి ని లేదా రిమోట్ బ్రౌజర్‌లో కంట్రోల్ చేయండి
ని ఎంచుకోవడం ద్వారా మీరు రిమోట్ బ్రౌజర్‌లో Gemini Spark చర్యలను ఆపవచ్చు.
మీ Gemini Spark సెట్టింగ్‌లలో కూడా రిమోట్ బ్రౌజర్ డేటాను తొలగించవచ్చు. ఇది రిమోట్ బ్రౌజర్‌లోని అన్ని సైట్‌ల నుండి మిమ్మల్ని సైన్ అవుట్ చేస్తుంది.
రిమోట్ కంప్యూటర్: మీరు Gemini Spark సెట్టింగ్‌లలోనే నేరుగా మీ కోడ్ ఎగ్జిక్యూషన్ హిస్టరీని, ఫైల్స్‌ను మేనేజ్ చేయవచ్చు లేదా క్లియర్ చేయవచ్చు.
- మీ రిమోట్ బ్రౌజర్ డేటాను, రిమోట్ కంప్యూటర్ డేటాను తొలగించాము
- మీ షెడ్యూల్స్, టాస్క్‌లు పాజ్ అయ్యాయి, వాటిని తొలగించలేదు
- మీ చాట్‌లను తొలగించము, అయితే మీరు వాటిని ఏ సమయంలోనైనా Gemini యాప్స్ యాక్టివిటీలో మేనేజ్ చేయవచ్చు
- macOSలో Gemini Sparkకు ఇకపై మీ కనెక్టడ్ ఫోల్డర్లలోని లోకల్ ఫైల్స్‌కు యాక్సెస్ ఉండదు
- పాజ్ చేసిన టాస్క్‌లను, షెడ్యూల్స్‌ను Gemini ఆటోమేటిక్‌గా కొనసాగిస్తుంది
Gemini Live
Gemini Live సంభాషణల డేటాను Google ఏ విధంగా ఉపయోగిస్తుంది?మీ యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, Gemini Liveతో మీ ఇంటరాక్షన్‌ల రికార్డింగ్‌లు, టైప్ చేసిన మాటల ఫైల్స్, అలాగే Gemini Liveతో మీరు షేర్ చేసే ఇతర కంటెంట్ Gemini యాప్స్ గోప్యతా ప్రకటన ఆధారంగా ప్రాసెస్ అవుతాయి, Gemini యాప్స్ యాక్టివిటీలో స్టోర్ అవుతాయి. మీరు ఏ సమయంలోనైనా మీ Gemini యాప్స్ యాక్టివిటీని మేనేజ్ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.
"యాక్టివిటీని సేవ్ చేయండి" ఆఫ్‌లో ఉంటే, మీ Gemini Live చాట్‌లు గరిష్ఠంగా 72 గంటలు మీ Google ఖాతాలో స్టోర్ అయి ఉంటాయి, తద్వారా Google సర్వీస్‌ను అందించి, ఏ ఫీడ్‌బ్యాక్‌ను అయినా ప్రాసెస్ చేయగలదు. మరింత తెలుసుకోండి.
Gemini Live టైప్ చేసిన మాటల ఫైల్స్
యాక్టివిటీని సేవ్ చేయండి ఆన్‌లో ఉంటే, మీ Live చాట్‌లకు సంబంధించిన "టైప్ చేసిన మాటల ఫైల్స్"ను AI మోడల్స్‌తో సహా, Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించడం జరుగుతుంది. మీ 'యాక్టివిటీని సేవ్ చేయండి' సెట్టింగ్ గురించి మరింత తెలుసుకోండి.
Gemini Live ఆడియో, వీడియోలు & స్క్రీన్ షేర్‌లు
మీ Gemini Live ఆడియో, వీడియో, స్క్రీన్ షేర్‌లను Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఆటోమేటిక్‌గా ఉపయోగించడం జరగదు. దీనిని ఎప్పుడైనా ఎలా మార్చవచ్చో మరింత తెలుసుకోండి.
దయచేసి ఇతరుల గోప్యతను గౌరవించండి, Live చాట్‌లో వారిని చేర్చడానికి ముందు లేదా రికార్డ్ చేయడానికి ముందు, వారి అనుమతిని కోరండి.
Chromeలో Gemini
నేను Chromeలో Geminiని ఉపయోగించినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?మీరు Chromeలో Gemini ఫీచర్‌ను ఉపయోగించేటప్పుడు, మీ ప్రస్తుత ట్యాబ్ నుండి అలాగే మీరు ఇప్పటికే దానితో షేర్ చేసిన ఏవైనా ఇతర ట్యాబ్‌ల నుండి పేజీ కంటెంట్‌ను, URLను Gemini కలెక్ట్ చేసి, ప్రాసెస్ చేస్తుంది. మీరు Chromeలో చూసిన పేజీలను కనుగొనడానికి Chromeలో Geminiని ఉపయోగిస్తే, మీ హిస్టరీలోని సంబంధిత URLలను కూడా Gemini కలెక్ట్ చేస్తుంది. Gemini ఉపయోగించే పేజీ కంటెంట్‌లో కొంత భాగం మీకు కనిపించకపోవచ్చు.
డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది
మీ యాక్టివిటీని సేవ్ చేయండి సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, "Chromeలో Gemini" ఫీచర్ ద్వారా మీరు విజిట్ చేసే వెబ్‌సైట్స్ నుండి సమాచారం, దానితో మీరు షేర్ చేసే ఆడియో అలాగే ఫైల్స్ Gemini యాప్స్ యాక్టివిటీలో స్టోర్ అవుతాయి. పేజీ కంటెంట్ అనేది మీ Google ఖాతాకు తాత్కాలికంగా లాగ్ చేయబడుతుంది, అది మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
మీరు ప్రస్తుతం Geminiకి షేర్ చేస్తున్న ట్యాబ్‌ను, ఇంకా ఏవైనా ఓపెన్‌గా ఉన్న ట్యాబ్‌లను షేర్ చేయకుండా ఆపివేయవచ్చు. మరింత తెలుసుకోండి.
Android యాప్‌లలో స్క్రీన్ ఆటోమేషన్
Android యాప్‌లలో టాస్క్‌లను పూర్తి చేయడంలో నాకు సహాయపడటానికి Gemini స్క్రీన్ ఆటోమేషన్‌ను ఉపయోగించినప్పుడు నా డేటా విషయంలో ఏమి జరుగుతుంది?మీ డివైజ్‌లోని నిర్దిష్ట యాప్‌లలో స్క్రీన్ ఆటోమేషన్‌ను ఉపయోగించి ఆర్డర్‌లను ప్లేస్ చేయడం లేదా రైడ్‌లను బుక్ చేయడం వంటి టాస్క్‌లలో Gemini సహాయపడగలదు.
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
Gemini పొరపాట్లు చేయవచ్చు. మీ తరఫున అది చేసే వాటికి మీరే బాధ్యత వహించాలి, కాబట్టి దాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించండి. మీరు దాన్ని ఆపివేయవచ్చు, దాని ప్రోగ్రెస్‌ను చూడవచ్చు, అలాగే మాన్యువల్‌గా కంట్రోల్ చేయవచ్చు.
గుర్తుంచుకోండి
ఆటోమేషన్ సమయంలో, Gemini స్క్రీన్‌షాట్‌లను తీసుకుంటుంది, వీటిలో యాప్‌లో కనిపించే ఏ సమాచారం అయినా ఉంటుంది. యాక్టివిటీని సేవ్ చేయండి ఆన్‌లో ఉంటే, ట్రెయినింగ్ పొందిన రివ్యూవర్‌లు స్క్రీన్‌షాట్‌లను రివ్యూ చేస్తారు, ఆపై Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి వాటిని ఉపయోగిస్తారు. Gemini చాట్‌లలో లాగిన్ లేదా పేమెంట్ సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు.
ఎమర్జెన్సీల కోసం లేదా సెన్సిటివ్ (గోప్యమైన) సమాచారం ఉన్న టాస్క్‌ల కోసం స్క్రీన్ ఆటోమేషన్‌ను ఉపయోగించవద్దు. స్క్రీన్ ఆటోమేషన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, మీరు కనెక్టెడ్ యాప్స్‌తో Geminiని ఉపయోగించవచ్చు. కనెక్టెడ్ యాప్స్ గురించి మరింత తెలుసుకోండి.
స్క్రీన్ ఆటోమేషన్‌తో టాస్క్‌లను పూర్తి చేయడానికి మీరు Geminiని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి మరింత తెలుసుకోండి.
షాపింగ్
నేను Gemini ద్వారా Google షాపింగ్ కార్ట్‌కు ఐటెమ్‌లను జోడించినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?మీరు Gemini నుండి మీ Google షాపింగ్ కార్ట్‌కు ప్రోడక్ట్‌లను జోడించినప్పుడు, కార్ట్, ఆర్డర్ డేటా మీ Google Walletలో సేవ్ అవుతుంది. ఈ డేటా Google నియమాలు, గోప్యతా పాలసీ, మీ Wallet సెట్టింగ్‌లకు అనుగుణంగా ఉపయోగించబడుతుంది, ఇందులో వ్యక్తిగతీకరణ, యాడ్‌లు (మీ సెట్టింగ్‌లను బట్టి) కూడా ఉంటాయి.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
మీరు కార్ట్, నా ఆర్డర్‌ల సెట్టింగ్ ద్వారా ఎప్పుడైనా Geminiలో మీ Google షాపింగ్ కార్ట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
Google Walletలో మీ డేటాను, గోప్యతను ఎలా మేనేజ్ చేయాలో మరింత తెలుసుకోండి.
మీరు Gemini నుండి కొనుగోలు చేయడానికి Google Payని ఉపయోగించినప్పుడు, లావాదేవీల హిస్టరీ మీ Google Pay నా యాక్టివిటీలో సేవ్ అవుతుంది. ఈ డేటాను Google Payments గోప్యతా ప్రకటనతో పాటు మీ Google Pay, Google Wallet సెట్టింగ్స్‌కు అనుగుణంగా ఉపయోగిస్తాము. మీ సెట్టింగ్స్‌ను బట్టి, ఇందులో వ్యక్తిగతీకరణ, యాడ్‌ల వంటివి కూడా ఉంటాయి.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
మీరు Google Wallet వెబ్‌సైట్‌లో ఏ సమయంలోనైనా మీ లావాదేవీల హిస్టరీని రివ్యూ చేయవచ్చు.
మీ షాపింగ్‌లో Gemini ఏ విధంగా సాయం చేస్తుందన్న దానిపై మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Google Labs అందించే Gems
నేను Google Labs నుండి Gemsతో ఇంటరాక్ట్ అయినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?మీరు ఇప్పుడు Gemini యాప్స్‌లో లేదా opal.googleలో Google Labs నుండి Gemsను యాక్సెస్ చేయవచ్చు, కనుగొనవచ్చు.
Google Labs నుండి పొందిన Gems అనేవి మీరు క్రియేట్ చేయగల, ఎడిట్ చేయగల, షేర్ చేయగల AI మినీ-యాప్‌లుగా బండిల్ చేయబడిన అనుకూ�� వర్క్‌ఫ్లోలు. మీరు Google Labs నుండి Gemsతో ఇంటరాక్ట్ అయినప్పుడు, మీరు Google Labs ప్రయోగమైన Opalను ఉపయోగిస్తున్నారు.
ముఖ్య గమనిక: Google ల్యాబ్స్ ప్రయోగం అయిన Opal, Gemini యాప్స్‌లో భాగం కాదు. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ నుండి డేటా మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు, Geminiకి కనెక్ట్ అయిన Workspace యాప్ సెట్టింగ్ ద్వారా కంట్రోల్ చేయబడదు. Gemini యాప్స్ గోప్యతా ప్రకటన వర్తించదు, మీరు అందించే ఫీడ్‌బ్యాక్‌తో సహా మీ Opal డేటా Google గోప్యతా పాలసీ ప్రకారం ప్రాసెస్ చేయబడుతుంది.
డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది
మీరు క్రియేట్ చేసే Google Labs నుండి పొందిన Gems, వాటితో మీ ఇంటరాక్షన్‌లు, మీరు అప్‌లోడ్ చేసే మీడియా (ఆడియో, ఇమేజ్‌లు, డాక్యుమెంట్‌లు) మీ Google Driveలోని “Opal” ఫోల్డర్‌లో స్టోర్ చేయబడతాయి.
Google Labs నుండి మీ Gemsను తొలగించడంతో సహా మీ డేటాను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు
మీరు Gemini వెబ్ యాప్‌లోని Gems మేనేజర్ నుండి లేదా మీ Google Driveలోని “Opal” ఫోల్డర్ నుండి Google Labs నుండి Gemsను తొలగించవచ్చు. Google Labs నుండి Gemతో అనుబంధించబడిన ఇంటరాక్షన్ హిస్టరీ కూడా తొలగించబడుతుంది.
ఇతర AI ప్లాట్‌ఫామ్‌ల నుండి ఇంపోర్ట్ (దిగుమతి) చేసిన డేటా
నేను ఇతర AI ప్లాట్‌ఫామ్‌ల నుండి మెమరీని లేదా చాట్‌లను ఇంపోర్ట్ (దిగుమతి) చేసుకున్నప్పుడు నా డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది?మీరు ఇతర AI ప్లాట్‌ఫామ్‌ల నుండి దిగుమతి చేసుకునే డేటా (మెమరీ, చాట్‌లు) మీ యాక్టివిటీలో సేవ్ అవుతుంది. ఈ డేటాను మీ Gemini యాప్స్ యాక్టివిటీకి అనుగుణంగా ఉపయోగిస్తాము. ఇందులో జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడంతో సహా మా సర్వీస్‌లను ఇంప్రూవ్ చేయడం, అలాగే Googleకు, మా యూజర్‌లకు, జనరల్ పబ్లిక్‌కు సమస్యలు రాకుండా చూడటం కూడా ఉంటాయి. మీరు ఏ సమయంలోనైనా మీ యాక్టివిటీని మేనేజ్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. మీ Gemini యాప్స్ యాక్టివిటీని మేనేజ్ చేయడం, తొలగించడం ఎలా అన్నది తెలుసుకోండి.
మీరు దిగుమతి చేసిన ఒక్కో చాట్‌ను తొలగించడానికి లేదా Gemini యాప్స్‌కు వాటిని దిగుమతి చేయడానికి ఉపయోగించిన .zip ఫైల్‌తో అనుబంధంగా ఉన్న దిగుమతి చేసిన అన్ని చాట్‌లను బల్క్‌గా తొలగించడానికి కూడా ఎప్పుడైనా ఎంచుకోవచ్చు.
Notebookలు
నేను Geminiలో Notebookలను ఉపయోగించినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?Geminiలోని మీ Notebookలతో చాట్‌లు మీ Keep యాక్టివిటీ సెట్టింగ్ ప్రకారం సేవ్ చేయబడతాయి, రివ్యూవర్‌ల సహాయంతో Geminiని మెరుగుపరచడంతో సహా Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో వివరించిన విధంగా ఉపయోగించబడతాయి. మీరు Geminiలో సోర్స్‌గా మీ నోట్‌బుక్‌కు జోడించే ఫైల్స్‌ను మా జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడానికి నేరుగా ఉపయోగించడం జరగదు.
అవతార్‌లు
నేను Gemini యాప్స్‌లో అవతార్‌ను క్రియేట్ చేసినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?అవతార్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు మీ వాయిస్, ముఖం రికార్డ్ అవుతాయి. Gemini యాప్స్‌తో సహా నిర్దిష్ట Google సర్వీస్‌లలో మీ అవతార్‌ను ఉపయోగించి AI కంటెంట్‌ను జెనరేట్ చేయడానికి, Googleను, మా యూజర్లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడానికి Google ఆ డేటాను ఉపయోగిస్తుంది.
డేటా ఎలా స్టోర్ అవుతుంది
మీ రికార్డింగ్‌లు మీ Google ఖాతాలో సురక్షితంగా స్టోర్ అయి ఉంటాయి. మీరు 3 సంవత్సరాల పాటు మీ రికార్డింగ్‌లను యాక్సెస్ చేయకపోతే లేదా ఉపయోగించకపోతే, Google వాటిని ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
మీ రికార్డింగ్‌లు మీ కంట్రోల్‌లో ఉంటాయి; వాటిని మీ Google ఖాతాలోని డేటా & గోప్యతా ట్యాబ్‌లో ఎప్పుడైనా తొలగించవచ్చు. ��ీ Gemini ��ెట్టింగ్‌ల��ో క��డా ��ీరు ��ొలగిం��ు ��ప్షన్‌ను కనుగొనవచ్చు.
మీ డేటాను ఎలా ఉపయోగిస్తారు
దుర్వినియోగాన్ని లేదా హానిని అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు తప్ప, మా సర్వీస్‌లకు శక్తినిచ్చే జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడానికి మీ రికార్డింగ్‌లను ఉపయోగించము.
ముఖ్య గమనిక: మీ YouTube ఛానెల్‌లో (ఒకవేళ మీకు ఉంటే) దాచుకునే అవతార్ (avatar) డేటా కోసం YouTube అందించే సెట్టింగ్‌కు, ఈ సెట్టింగ్‌కు అసలు సంబంధం లేదు. ఇవి రెండు పూర్తిగా వేర్వేరు. ఒక దాన్ని తొలగించడం వల్ల మరొకటి ప్రభావితం అవ్వదు.
Canvas
నేను Canvas వెబ్ యాప్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?యూజర్ జెనరేట్ చేసిన Canvas యాప్స్‌తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు, సదరు యాప్స్ క్రియేటర్లు మీరు ఎంటర్ చేసే ఏ విధమైన ఇన్‌పుట్‌ను అయినా చూడగలరు.
డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది
యూజర్ డేటాను నిరంతరం Firebaseలో స్టోర్ చేసే ఆప్షన్‌ను Canvas యాప్స్‌కు Google అందిస్తోంది. యాప్ క్రియేటర్లు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడానికి ఎంచుకోవచ్చు, కానీ మీతో చేసిన ఏ విధమైన ఇంటరాక్షన్ డేటానయినా ఇతర లొకేషన్లలో కూడా స్టోర్ చేయవచ్చు (లేదా అసలు స్టోర్ కూడా చేయకపోవచ్చు).
మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి
జాగ్రత్తగా అడుగేయండి, మీరు విశ్వసించే యాప్‌లతోనే ఇంటరాక్ట్ అవ్వండి. మీరు Canvas యాప్‌తో ఏ డేటానయినా ఒకసారి షేర్ చేసాక, మీకు దాన్ని తొలగించే ఆప్షన్ ఉండదు, కానీ యాప్ క్రియేటర్‌కు ఉంటుంది.
సర్వీస్ నియమాలు
Gemini యాప్స్‌ను ఉపయోగించడానికి ఏ నిబంధనలు వర్తిస్తాయి?Google సర్వీస్ నియమాలు, జెనరేటివ్ AI నిషేధిత వినియోగ పాలసీ Gemini యాప్స్‌కు వర్తిస్తాయి.
మీరు కొరియాకు చెందిన కన్జ్యూమర్ అయితే, మీరు Gemini యాప్స్‌ను వినియోగించడం అనేది కొరియన్ లొకేషన్ సర్వీస్ నియమాలకు కూడా లోబడి ఉంటుందని అంగీకరిస్తున్నారు.