BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
''ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో మెట్రో కారిడార్లు విస్తరించేందుకు వీలుంటుంది. అన్ని ఫేజ్‌ల పరంగా ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా, నిర్వహణ పరంగా మరింత సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది'' అని మెట్రో మొదటి దశ స్వాధీనం అగ్రిమెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
జెట్లీ: జేమ్స్ బాండ్ హీరోగా సత్య ప్రయత్నం అలరించిందా?
సత్య హీరోగా , మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో థియేటర్లోకి వచ్చిన జెట్లీ మూవీ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?
కోహినూర్ వజ్రం భారత్ నుంచి ఎన్నెన్ని దేశాలు తిరిగింది, ఇప్పుడెక్కడుంది
నాదిర్ షా ఆ సమయంలో దిల్లీ నుంచి దోచుకుని ఇరాన్‌కు తీసుకువెళ్లిన తఖ్త్-ఏ-తౌస్ అనే ప్రసిద్ధ సింహాసనం పైభాగంలో దాన్ని పొదిగారు. ఆ కోహినూర్ చిన్న కోడిగుడ్డంత ఉండేది. దాన్ని అమ్మితే, ప్రపంచంలో ఉన్న అందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టొచ్చని చెప్పుకునేవారు.
గాయపడ్డ సింహం మూవీ రివ్యూ: హీరో ‘డోనల్డ్ ట్రంప్ మీద ఎందుకు పగపట్టాడు’?
కామెడీ, పంచ్లైన్లు అక్కడక్కడ నవ్విస్తాయి. తరుణ్ భాస్కర్ ఈ తరహా కామెడీని ఆయన గత సినిమాల్లో చూసేశాం. కీడాకోలా తరహా పదాల గారడి, వాక్యాలను విరిచి ఫన్ చేయడం రొటీన్ అనిపిస్తుంది.
ఆంగ్ సాన్ సూచీ: గృహ నిర్బంధానికి మారుస్తున్నామన్న సైనిక ప్రభుత్వం.. అసలు జీవించి ఉన్నారో లేదో అంటున్న కుమారుడు
2021లో జరిగిన సైనిక తిరుగుబాటు సమయంలో ఆమెను పదవి నుంచి తొలగించిన తర్వాత సైనిక జైలులో ఆమెను నిర్బంధంలో ఉంచారు. నోబెల్ బహుమతి గ్రహీత అయిన సూచీ వయసు 80 ఏళ్లు. మిగిలిన శిక్షను ఆమె ఇంటి నుంచి అనుభవించేలా మార్పులు చేసినట్టు సైనిక తిరుగుబాటుకు నేతృత్వం వహించిన సైనిక నాయకుడు మిన్ ఆంగ్ హ్లెయింగ్ ప్రకటించారు.
ఎండ నుంచి తప్పించుకోవాలని చూస్తే తల ఇరుక్కుపోయింది..
ఆ పాలక్యాన్ను విడదీయడాయడానికి గ్రామస్థులు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత గ్రామానికి దగ్గరగా ఉన్న ఒక వెల్డింగ్ షాపు దగ్గరికి అతడిని తీసుకెళ్లి ఆ క్యాన్‌ను కట్ చేసి, తల బయటికొచ్చేలా చేశారు. ఈలోపు దాదాపు రెండు గంటలపాటు యువకుడి తల పాల క్యాన్‌లో ఇరుక్కుపోయింది.
డిజిటల్ మోసాల్లో రూ. 23,750 కోట్లు కోల్పోయిన భారతీయులు
ఈ రకమైన మోసాన్ని నిపుణులు ''సోషల్ ఇంజనీరింగ్'' స్కామ్ అని పిలుస్తున్నారు. బాధితుల మానసిక స్థితిని మానిపులేట్ చేసి, వారిలో భయాన్ని, ఆత్రుతను పెంచి స్కామర్లు వారిని దోచుకుంటున్నారు. గత ఐదేళ్లుగా దేశంలో డిజిటల్ చెల్లింపులు అనూహ్యమైన రీతిలో పెరగడంతో ఈ రకమైన మోసాలు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి.
ట్యాబ్లెట్లలో వెజ్, నాన్ వెజ్ ఉంటాయా?
చాలా ట్యాబ్లెట్లలో (క్యాప్సూల్స్ కాకుండా) ఔషధాన్ని గట్టిగా ఉండేలా చేయడానికి సాధారణంగా మొక్కల ఆధారిత బైండర్లు, ఫిల్లర్లు వాడతారని హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసిస్ట్ స్వాతి ‘బీబీసీ’తో చెప్పారు.
వీడియో, ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనాభా లెక్కల్లో ఎక్కడ నమోదు చేసుకోవాలి?, వ్యవధి 2,37
చాలామంది తల్లిదండ్రులు సొంతూళ్లో, పిల్లలు వేరే ఊళ్లో ఉద్యోగాల్లో ఉంటారు. ఇలాంటప్పుడు జనగణనలో ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన��కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































